Site icon HashtagU Telugu

Electric Cars 2023: 2023లో విడుదల కానున్న ఎలక్ట్రానిక్ కార్లు ఇవే.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Cars Under 10 Lakhs

Electric Cars 2023

రోజు రోజుకి దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజిల్ రెట్లు పెరిగిపోతుండడంతో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో భారత్ లో గడిచిన కొన్ని నెలలుగా చూసుకుంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లే విక్రయించబడ్డాయి. అంతేకాకుండా చాలా వరకు కార్లు కొనుగోలు చేయాలి అనుకున్న వారు ఎలక్ట్రిక్ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే 2023లో భారత్ లోకి లాంచ్ కాబోతున్న ఎలక్ట్రానిక్ కార్లు వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బీఎండబ్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు త్వరలోనే విడుదల కానుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒకసారి పూర్తిగా చార్జ్ చేసే దాదాపుగా 625 కిలోమీటర్లు మైలేజ్ ను ఇస్తుంది.

ఈ కారును 2023 ముగింపు దశలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్‌లో వెనుక కూర్చున్న ప్రయాణీకుల కోసం 31.3 అంగుళాల 8కే టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల కర్వ్డ్ డిజిటల్ కాక్‌పిట్, 14.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్ ఫ్రంట్ ఇంకా రియర్ సీట్లు లాంటి అనేక ఫీచర్స్ ను అందించారు. త్వరలో విడుదల కాబోతున్న ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా X UV400 కారు కూడా ఒకటి. ఈ మహీంద్రా XUV 400 ఈవీ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరించిన మహీంద్రా కంపెనీ 2023 జనవరి మధ్యలో దీని ధరను ప్రకటించనుంది. అయితే మార్కెట్లోకి రానున్న ఈ కొత్త మహీంద్రా XUV 400 కారుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 కిమీ మైలేజీని ఇస్తుంది.

వచ్చే ఏడాది విడుదల కానున్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు కూడా ఒకటి. కొత్త పంచ్ ఈవీ లో టియాగో ఈవీ వంటి రెండు బ్యాటరీలు చాయిస్‌గా,ఇంకా ఇందులో ఎంట్రీ లెవల్ 19.2 KVH మోడల్ , టాప్-ఎండ్ 24 KVH బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఫలితంగా ఈ ఈవీ కారు ఒక్కో ఛార్జ్‌కు 280 నుంచి 350 కి.మీ మైలేజీని ఇస్తాయి. ఎంజీ మైక్రో ఎలక్ట్రానిక్ కారు కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ కారు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడం కోసం మార్కెట్ లోకి లాంచ్ అవ్వబోతోంది. ఈ కారు ఒక్కో ఛార్జీకి 150 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న వాటిలో ఎలక్ట్రిక్ కార్ మోడల్స్‌లో Citroen E C3 కూడా ఒకటి. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిమీ మైలేజీని అందిస్తుంది.