Aadhaar: ఆధార్ లో పేరు,అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు.. ప్రభుత్వం ఏమి చెబుతోందంటే?

ఇండియాలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక ఈ రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 07:30 PM IST

ఇండియాలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక ఈ రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రైవేటు గవర్నమెంట్ పథకాలకు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సేవలతో పాటు ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడానికి ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. మరి అంత ముఖ్యమైన డాక్యుమెంట్ లో తప్పులు ఉంటే చేసుకోవడం అనేది తప్పనిసరి.అయితే ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, అడ్రస్, జెండర్ లాంటి వాటిలో తప్పులు ఉంటే చిక్కుల్లో పడ్డట్టే. ఒకవేళ వాటిని మీరు గుర్తించినట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవచ్చు.

అయితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సహా ఇతర అప్ డేట్స్ చేసే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, అడ్రస్, జెండర్ లాంటి వివరాలను ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు అనే దానిపై ఒక లిమిట్ ఇచ్చారు. ఆధార్ కార్డు వివరాలను ఎన్నిసార్లు అప్‌డేట్ చేయొచ్చన్న విషయాన్ని చెబుతూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొన్ని పరిమితులు, షరతులను పెట్టింది.. ఆ వివరాల్లోకి వెళితే.. ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎక్కువ సార్లు మార్చుకోవడానికి వీలు లేదు. ఆధార్‌ కార్డ్ హోల్డర్‌ తన జీవిత కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేసుకునే వీలు ఉంది. అలాగే జెండర్ మార్చు కోవాలంటే ఒకసారి మాత్రమే ఛాన్స్ ఒకవేళ పరిమితికి మించి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేక రిక్వెస్ట్ పెట్టాలి. కాబట్టి ఆధార్‌ కార్డు అప్ డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అదేవిధంగా ఆధార్ కార్డు సమస్యల పరిష్కారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంది. UIDAI ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ తీసుకొచ్చింది. ఈ హెల్ప్ లైన్ నంబర్ 1947. ఈ నెంబర్ కి కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు. ఈ నంబర్‌కు కాల్ చేసి మీ అనుమానాలు అన్నీ 1947 నంబర్‌కు కాల్ చేస్తే UIDAI ప్రతినిధులు మీతో మాట్లాడుతారు. ఉర్దూ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, మరాఠీ మొత్తం 12 భాషల్లో UIDAI ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు. ఈ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు, అదేవిధంగా ఆదివారం రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.