భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. చిన్నపిల్లల నుంచి ఈ ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఈ 12 అంకెల ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ వివరాలు సైతం నిక్షిప్తమై ఉంటాయి. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ పని ఏది కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. ఆధార్ కార్డు అనేది ఒక ఐడీలా కూడా పనిచేస్తుంది. అలా ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది.
అయితే ఆధార్ కార్డులో చాలా రకాలున్నాయనే సంగతి చాలామందికి తెలియదు. అందులో ఒకటి బ్లూ ఆధార్ కార్డు. అసలీ బ్లూ ఆధార్ కార్డు అంటే ఏమిటి? దీని ఉపయోగాలు ఏంటి? అన్న విషయానికి వస్తే.. బ్లూ ఆధార్ కార్డు అనేది చిన్న పిల్లలకు ఉద్దేశించిందగి. దేశంలోని ఐదేళ్లలోపు పిల్లలకు యూఐడీఏఐ బ్లూ ఆధార్ కార్డు జారీ చేస్తుంది. బ్లూ ఆధార్ కార్డుకు మరో పేరు బాల్ ఆధార్ కార్డు. దీనికి బయోమెట్రిక్ అవసరం లేదు. మొన్నటి వరకు పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు బర్త్ సర్టిఫికేట్ అవసరమయ్యేది.
కానీ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ లేకుండానే బ్లూ ఆధార్ కార్డు పొందవచ్చు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో కూడా బ్లూ ఆధార్ కార్డు అప్లై చేయవచ్చు. బ్లూ ఆధార్ కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ఐదేళ్ల వరకే ఇది పనిచేస్తుంది. ఐదేళ్ల తరువాత బ్లూ ఆధార్ కార్డు రెన్యువల్ చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఐదు ఏళ్లలో పిల్లలు ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా ఈ బ్లూ కార్డును అప్లై చేసుకోండి. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకున్నప్పటికీ ఇందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.