Site icon HashtagU Telugu

Aadhaar: మీ ఆధార్ ను ఎవరైనా ఉపయోగిస్తున్నారా లేదా? తెలుసుకోవడం ఎలా?

Aadhaar Update

Aadhaar Update

ఈరోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రతి చిన్న పెద్ద విషయాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. చాలా రకాల పనులు ఆధార్ కార్డు లేకుండా అసలు పూర్తి కావు. సంవత్సరం లోపు పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆధార్ కార్డు మన బ్యాంకు ఖాతా మొబైల్ నెంబర్, పాన్ కార్డు ఇలా ప్రతి ఒక్కదానికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆధార్ నెంబర్ కొడితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని కొన్ని తరహా మోసాలకు పాల్పడుతూ ఉంటారు.

ఈ రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించి తెలియకుండానే ఆధార్ కార్డు ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఆధార్ కార్డ్‌ లో మన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. అయితే మీరు కొన్ని దశలను అనుసరించడం ద్వారా మీ ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీరు మీ ఆధార్ కార్డును చాలా చోట్ల ఇచ్చినట్లయితే అది దుర్వినియోగం అవుతుందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు కూడా దీని గురించి తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందో లేదో తెలుసుకోవడానికి మీరు మై ఆధార్ పోర్ట్‌ ని సందర్శించాలి.

మీరు వెబ్‌సైట్‌ కి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ ను నమోదు చేసి, ఓటీపీ తో లాగిన్ ఎంపికను ఎంచుకోవాలి. ఇప్పుడు మీ నంబర్‌ కు ఓటీపీ పంపబడుతుంది. దీని ద్వారా మీరు ధృవీకరణ వంటి ప్రక్రియను పూర్తి చేయాలి. ధృవీకరణ తర్వాత మీరు ప్రామాణీకరణ చరిత్ర ఎంపికకు వెళ్లాలి. తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్ వినియోగాన్ని తెలుసుకోవడానికి తేదీని ఎంచుకోవచ్చు. ఏదైనా తేదీలో మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు మీరు భావిస్తే, మీరు UIDAIకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మీ ఆధార్ కార్డు ఎవరెవరు ఉపయోగిస్తున్నారు అన్న విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు.