Tweet Edit: ‘ట్విట్టర్’లో ట్విట్ ఎడిట్ చేసుకోవచ్చు.. కాకపోతే ఒక్క కండిషన్?

సాధారణంగా మనం ట్విట్టర్ లో ఏదైనా ఒక ట్విట్ చేసిన తరువాత దాన్ని ఇలా ఎడిట్ చేసుకోవాలో తెలియక చాలా

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 09:30 AM IST

సాధారణంగా మనం ట్విట్టర్ లో ఏదైనా ఒక ట్విట్ చేసిన తరువాత దాన్ని ఇలా ఎడిట్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఆ ట్వీట్ ని డిలీట్ చేసి మళ్ళీ ట్వీట్ చేస్తూ ఉంటారు. అయితే అలా ట్వీట్ ని ఎడిట్ చేసుకోవాలి అని అనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ట్విట్టర్ యాజమాన్యం. ట్విట్టర్ లో ట్వీట్ చేసిన తర్వాత దానిని ఎడిట్ చేసే ఫీచర్ ను త్వరలోనే ట్విట్టర్ యాజమాన్యం తీసుకురానుందట. ఈ అభివృద్ధి చేయడంతో పాటుగా మరి కొంతమంది యూజర్ల ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసినట్టు ట్విట్టర్ తాజాగా ప్రకటించింది.

అయితే త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు బ్లాగ్ లో తెలిపింది ట్విట్టర్ యాజమాన్యం. అయితే ఈ ట్వీట్ చేసిన తర్వాత 30 నిమిషాల వరకు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చని 30 నిముషాల సమయం మించిపోతే ఎడిట్ చేసుకోవడానికి ఉండదు అని యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా మనం చేసిన ఆ ట్వీట్ ను 30 నిమిషాల్లోపు ఐదు సార్ల వరకు ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే అలా ఎడిట్ చేసిన ఆ ట్వీట్ అందరికీ తెలిసేలా దానికి ప్రత్యేకంగా ఐకాన్ కనిపిస్తుందట.

దాంతో అసలు ట్వీట్ ఎడిటింగ్ కు గురైనట్టు యూజర్లకు తప్పుకుండా తెలుస్తుంది. అంతేకాదు దాని పై ట్యాప్ చేస్తే ఎడిట్ హిస్టరీ కూడా కనిపిస్తుందట. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి కేవలం ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికు మాత్రమే. మన దేశంలో బ్లూ సబ్ స్క్రిప్షన్ అందుబాటులో లేదు. అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి ఎంపిక చేసిన దేశాలలోనే ఇది అందుబాటులో వుంది. కనుక ఈ ఫీచర్ యూజర్లు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ట్విట్టర్ యాజమాన్యం తెలిపారు.