Twitter Content Creators : యూట్యూబ్ లాగే ఇకపై ట్విట్టర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించే ఛాన్స్..
ట్విట్టర్ లో వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్ కోసం ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు..
వారికి పేమెంట్ చేయడానికి రూ. 41.22 కోట్ల భారీ ప్యాకేజీని ఆయన అనౌన్స్ చేశారు..
ట్విట్టర్ లో వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్ గా(Twitter Content Creators) నమోదై ఉన్నవాళ్లు ఇక చేతినిండా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా అంటే.. వారి కంటెంట్ లోని రిప్లై (ప్రత్యుత్తరాల) సెక్షన్ లో డిస్ ప్లే అయ్యే యాడ్స్ కుగానూ లెక్క కట్టి పేమెంట్ ఇస్తారు. ఈ పేమెంట్స్ చేసేందుకే ముందస్తుగా రూ. 41.22 కోట్ల భారీ ప్యాకేజీని ఎలాన్ మస్క్ కేటాయించారు. ఈవివరాలను ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా లిండా యాకారినో చేరిన కొన్ని రోజులలోనే ఈ ప్రకటన వెలువడటాన్ని బట్టి.. ఇది ఆమె ఐడియానే అయి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.
Also read : Twitter 2 Features : ట్విట్టర్ వీడియోలకు 2 కొత్త ఫీచర్లు
బ్లూ టిక్ కలిగిన యూజర్లు తమ ట్వీట్లను పోస్ట్ చేసిన తర్వాత గంట వరకు వాటిని ఎడిట్ చేసేందుకు అనుమతి కల్పించే కొత్త ఫీచర్ను ట్విట్టర్ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. 2022 అక్టోబరులోనే తొలిసారిగా ఎడిట్ ఆఫ్షన్ ను ట్విట్టర్ ప్రవేశపెట్టింది. ప్రారంభంలో యూజర్లు తమ పోస్ట్ చేసిన 30 నిమిషాల్లోగా ఎడిట్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. యూజర్ల డిమాండ్ మేరకు ఈ సమయాన్ని గంటకు పొడిగించింది. ఎడిట్ ఆఫ్షన్ ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ లభిస్తోంది. ట్విట్టర్ కొత్త CEOగా లిండా యాకారినోను ప్రకటించిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ ఫీచర్ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే. ఈ స్పెషల్ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది బ్లూ టిక్ ప్రీమియం సేవను ఎంచుకునే అవకాశం ఉందని ట్విట్టర్ భావిస్తోంది.