Site icon HashtagU Telugu

Twitter Creators Good News : ట్విట్టర్ లో కంటెంట్ క్రియేటర్స్ కు ఇక కాసుల వర్షం!

Twitter Creators Good News

Twitter Creators Good News

Twitter Creators Good News : ట్విట్టర్ లో కంటెంట్ క్రియేట్ చేసేవారికి గుడ్ న్యూస్.. 

ఇకపై వారికి యాడ్ రెవెన్యూలో షేర్ ఇస్తామని ట్విట్టర్ వెల్లడించింది. 

అర్హులైన కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ ను ఎంపిక చేసి.. తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఇస్తామని ప్రకటించింది.  

Twitter బ్లూ సభ్యత్వం పొంది, గత 3 నెలలుగా ప్రతి నెలా 50 లక్షల కంటే ఎక్కువ ట్వీట్ ఇంప్రెషన్లు కలిగిన కంటెంట్ క్రియేటర్స్ ఇందుకు అర్హులని తెలిపింది.

ట్విట్టర్ లో పెట్టే పోస్టులలోని కామెంట్స్ సెక్షన్ లో డిస్ ప్లే అయ్యే యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూలో కొంత మొత్తాన్ని ఇప్పటికే ట్విట్టర్ క్రియేటర్స్ కు ఇస్తోంది. 

Also read :  Hollywood Shut Down : హాలీవుడ్ షట్ డౌన్..1.60 లక్షల మంది యాక్టర్స్ సమ్మె

7.50 లక్షల మంది ట్విట్టర్ ఫాలోయర్స్ కలిగిన తనకు రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొంటూ(Twitter Creators Good News) ఇటీవల బ్రియాన్ క్రాస్సెన్‌స్టెయిన్ అనే కంటెంట్ క్రియేటర్  ఒక ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద యూట్యూబ్ తరహా ఫీచర్స్ తో జనంలోకి మరింత చొచ్చుకుపోవాలని ట్విట్టర్ ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలోనే త్వరలో 3 గంటల నిడివి కలిగిన వీడియోలను సైతం అప్ లోడ్ చేసే అవకాశాన్ని యూజర్స్ కు కల్పించబోతోంది. ఆసక్తికరమైన కంటెంట్ ను క్రియేట్ చేసే వారిని అట్రాక్ట్ చేసి.. తద్వారా మరింత మంది యూజర్స్ ను పెంచుకోవాలని   ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. 2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన బిలియనీర్  ఎలాన్ మస్క్ ..  ఆ సోషల్ మీడియా యాప్ లో ఎన్నో మార్పులు చేస్తున్నారు. దాని ఆదాయాన్ని పెంచడం, యూజర్స్ ను పెంచడం, ఫీచర్లను పెంచడంపై ఆయన ఫోకస్ పెట్టారు.