Site icon HashtagU Telugu

Twitter Edit: ట్విట్టర్‌లో మార్పులు.. త్వరలోనే అందుబాటులోకి రానున్న ట్వీట్ ఎడిట్ బటన్?

Twitter

Twitter

మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఒకసారి ఒక ట్వీట్ చేసిన తర్వాత సెండ్ బటన్ నొక్కిన 30 సెకండ్లలో దానిని డిలీట్ చేసే అవకాశం ఉంది. కానీ ట్విట్టర్లో ఇప్పటివరకు ట్వీట్ ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. ఇలాంటి ఆప్షన్ అందుబాటులోకి తీసుకువస్తే ప్రముఖ ట్వీట్స్ కూడా తారుమారయ్యే పరిస్థితులు ఏర్పడతాయని గతంలో ట్విట్టర్ సీఈఓ జాక్‌ డోర్సే ట్విట్టర్ లో ఎప్పటికీ రాకపోవచ్చని తెలిపారు.

ప్రస్తుతం ట్విట్టర్ లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని అయితే ఇది కేవలం బ్లూ టిక్ ఉన్న యూజర్లకు మాత్రమే అందుబాటులో వస్తుందని ట్విట్టర్ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 320 మిలియన్ మంది యూసర్లు ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఇన్ని రోజులు ట్విట్టర్ ఎడిట్ ఆప్షన్ తీసుకురావాలని యూజర్లు కోరారు.

ఇలా యూజర్లు కోరిక మేరకు ప్రస్తుతం ట్విట్టర్ ఎడిట్ ట్విట్టర్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం బ్లూటూత్ ఉన్న యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానున్న ఈ ఆప్షన్స్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆప్షన్ ఉండటం వల్ల కొన్నిసార్లు తప్పుడు సమాచారం వెళ్లే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎడిట్ ట్వీట్ బటన్ వల్ల స్టేట్మెంట్ మారే ప్రమాదం కూడా ఉందని గతంలో కొందరు నిపుణులు ఈ ఆప్షన్ పై వారి అభిప్రాయాలను తెలియపరిచారు.

Exit mobile version