Site icon HashtagU Telugu

Twitter Blue Check: బ్లూటిక్ ప్రీమియం సర్వీస్ ను నిలిపివేసిన ట్విట్టర్.. యూజర్స్ ఫైర్స్?

Twitter Blue Check

Twitter Blue Check

ట్విట్టర్ బాధ్యతలను టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ట్విట్టర్ బాధ్యతలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సంచలన ప్రకటన చేస్తూ వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాడు. ఇకపోతే నెలకు 8 డాలర్లు చెల్లించి బ్లూటిక్ వెసులుబాటును కల్పించిన ఎలాన్ మస్క్ సమయంలోనే ఈ సర్వీసులను నిలిపివేశారు.కాగా నకిలీ ట్విట్టర్ ఖాతాలో పెరిగిపోవడంతో ఈ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటికే తాజాగా యూజర్లకు ట్విట్టర్ బ్లూటూత్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ను కనిపించడం లేదు అని వెల్లడించారు. ట్విట్టర్ బాధ్యతలు ఎలాన్ మస్క్ చేతికి వచ్చిన తర్వాత ట్విట్టర్ లో బ్లూ టిక్ సర్వీసును నెలవారి చార్జీ చెల్లింపులతో ప్రీమియం సర్వీస్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా చార్జ్ చేసిన వారికి ఎటువంటి వెరిఫికేషన్ నిర్వహించకుండా బ్లూ టిక్ ఫెసిలిటీని కల్పించారు.

దీంతో ప్రముఖ వ్యాపార సంస్థలు సెలబ్రెటీలకు సంబంధించిన ఫేక్ ఖాతాలు ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పైకి పరుగులు పెట్టడంతో ఏది నకిలీ ఖాతానో ఏది అసలైన ఖాతానో తెలియక తికమకప్రారంభం అయ్యింది. ఇదే విషయంపై కొన్ని వ్యాపార సంస్థలు ఫిర్యాదు చేయడంతో సర్వీసులను నిలిపివేసారు. అయితే ఇది యూజర్స్ మంచి కోసమే చేసినప్పటికీ కొంతమంది వినియోగదారులు ట్విట్టర్ సంస్థ వారిపై ఫైర్ అవుతున్నారు. కాగా కొందరు ఈ బ్లూ టిక్ నిలిపివేయడంతో తలలు పట్టుకుంటున్నారు.

Exit mobile version