Twitter Payments: త్వరలోనే ట్విట్టర్ లో డిజిటల్ పేమెంట్స్.. ఎప్పటి నుంచో తెలుసా?

ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా పూర్తిగా పెరిగిపోతోంది.

  • Written By:
  • Publish Date - February 2, 2023 / 07:00 AM IST

ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా పూర్తిగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ ఉంది అంటే తప్పకుండా ఫోన్ పే,గూగుల్ పే, పేటీఎం లాంటివి తప్పకుండా ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్స్ ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యూపీఏ చెల్లింపులు వాట్సాప్ లో కూడా చేసే విధంగా వాట్సాప్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వాట్సాప్ బాటలోనే ట్విట్టర్ కూడా కొనసాగు ఎందుకు సిద్ధపడుతుంది. ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేయడానికి ముందు ఇలాంటి చర్చలే నడిచినా మస్క్ సీఈఓ అయ్యాక ఈ ప్రతిపాదన అటకెక్కింది.

ప్రస్తుతం మళ్లీ ట్విట్టర్ ద్వారా చెల్లింపులు అనే అంశం తెర పైకి వచ్చింది. మస్క్ ట్వీట్టర్ సీఈఓ అయ్యాక కంపెనీ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. మస్క్ బాధ్యతలను చేపట్టిన తర్వాత ట్విట్టర్ వినియోగదారులకు, సంస్థ వారికి పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. మస్క్ చేసిన పనికి ప్రస్తుతం ట్విట్టర్ ఎడ్వటైజ్ మెంట్ల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని కూడా కోల్పోయింది. దీంతో ట్విట్టర్ ప్రతినిధులు ఇతర ఆదాయ మార్గాల వైపు దృష్టి పెడుతున్నారు. దీంతో మళ్లీ ట్విట్టర్ ద్వారా చెల్లింపులు ఫీచర్ ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ట్విట్టర్ లో ప్రొడెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్తేర్ కాఫోర్డ్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ట్విట్టర్ ప్రతినిధులు మాత్రం స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే గతంలో మస్క్ తమ ట్విట్టర్ ను ది ఎవ్రీ థింగ్ యాప్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో ట్విట్టర్ భవిష్యత్ లో కచ్చితంగా చెల్లింపులు ఫీచర్ ను తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ విషయంపై సరైన అవగాహన రావాలి అంటే ట్విట్టర్ సంస్థ వారు స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.