Tvs: టీవీఎస్ నుంచి రెండు రేసింగ్ బైక్స్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ ఇప్పటికే పలు రకాల మోడల్స్ తో అద్భుతమైన ఫీచర్లు కలిగిన బైక్స్ ని

  • Written By:
  • Updated On - December 19, 2022 / 07:30 AM IST

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ ఇప్పటికే పలు రకాల మోడల్స్ తో అద్భుతమైన ఫీచర్లు కలిగిన బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని తాజాగా భారత్ లోకి మరొక రెండు కొత్త బైక్లను విడుదల చేసింది టీవీఎస్ సంస్థ. తాజాగా విడుదల చేసిన ఆ రెండు బైక్‌లు పర్ఫర్మెంస్ విభాగానికి చెందినవి. మరి ఈ బైక్స్ ఫీచర్లు ధర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదట టీవీఎస్ సంస్థ రెండు బైకులను అమెరికా లోని మెక్సికో లో విడుదల చేసింది. మెక్సికన్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ రెండు బైక్‌లను ఆవిష్కరించింది.

ఈ బైక్స్ టి‌వి‌ఎస్ ఆర్‌టి‌ఆర్ 200 4వి అండ్ టి‌వి‌ఎస్ ఆర్‌ఆర్ 310 బైక్స్ ని విడుదల చేసింది. టీవీఎస్ నుండి వస్తున్న కొత్త ఆర్ఆర్ ఆర్ 310 BS-VI బైక్‌కు థొరెటల్-బై-వైర్ టెక్నాలజీ ఇచ్చారు. ఈ బైక్ రేసింగ్ ప్రత్యేకతతో బైకర్‌కు చాలా సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించనుంది. కాగా ఈ బైక్ కి ఐదు అంగుళాల నిలువు TFT మల్టీ-ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌న ఉంది. అంతేకాకుండా, బ్లూటూత్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ కూడా ఇందులో ఉంది. బైక్‌లో రైడింగ్ కోసం అర్బన్, రెయిన్, స్పోర్ట్ అండ్ ట్రాక్ వంటి నాలుగు మోడ్‌లు ఇచ్చారు.మెక్సికోలో టి‌వి‌ఎస్ కంపెనీ మరో బైక్‌ను ప్రవేశపెట్టింది.

ఈ బైక్ పేరు ఆర్‌టి‌ఆర్ 200 4V. దీనికి ఆకర్షణీయమైన రేసింగ్ గ్రాఫిక్స్‌తో కొత్త ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు ఇచ్చారు. క్లా స్టైల్ పొజిషన్ ల్యాంప్‌తో మెరుగైన లాంగ్ రేంజ్ అందిస్తుంది. RTR సిరీస్‌లో రేస్ ట్యూన్డ్-ఫ్యూయల్ ఇంజెక్షన్ RT-Fi టెక్నాలజి అందించారు. అయితే బైక్స్ ధర ఎంత అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.