Site icon HashtagU Telugu

TVS Ronin Bike: టీవీఎస్ నుండి సూపర్ బైక్.. తక్కువ ధరలో అదిరే ఫీచర్లు!

Two Wheeler Puncture

Tvs Ronin Bike

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ ఇప్పటికే పలు రకాల అద్భుతమైన మోడల్స్ తో బైకులను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకున్న ఈ టీవీఎస్ సంస్థ అందుకు తగ్గట్టుగానే బైకులను సరికొత్తగా తయారు చేయడానికి గట్టిగానే కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టీవీఎస్ సంస్థ ఒక బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఈ బైక్ కోసం వినియోగదారులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ బైకు ఏడాది క్రితమే బైకును మార్కెట్లోకి తీసుకురావాలి అని ఆ సంస్థ అనుకున్న పనికి కరోనా మహమ్మారి కారణంగా కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ బైక్ ఫీచర్లో లుక్స్ పరంగా సూపర్ బైక్ లకు పోటీగా నిలవడంతో పాటుగా బీఎండబ్ల్యూ బైక్ ల కూడా కనిపిస్తుంది. కాగా ఈ బైక్ ఆన్లైన్లో టీవీఎస్ షోరూం నుండి కొనుగోలు చేసుకోవచ్చు. తాజాగా TVS Ronin 225 బైక్‌ను విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో అనగా టీవీఎస్ రోనిన్ ఎస్ఎస్ , టీవీఎస్ రోనిన్ డీస్ , టీవీఎస్ రోనిన్ టీడీ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

ఈ బైక్ యొక్క అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే అది వేడిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా చల్లబడటం ప్రారంభం అవ్వడం అన్నది అతి పెద్ద ఫీ చర్ గా చెప్పవచ్చు. ఇది పెద్ద ఆయిల్ కూలర్, ఓ3సి సిలిండర్‌ను కలిగి ఉంది, ఇది చల్లబరచడంలో సహాయపడుతుంది. ఫీచర్లతో పాటు లుక్, డిజైన్ పరంగా కూడా ఈ బైక్ బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లతో పోటీపడుతుంది. ఇక ఈ బైక్ ధర విషయానికి వస్తే.. రూ.1.49 లక్షల నుంచి ప్రారంభం కావున్నాయి.

Exit mobile version