GPS: జీపీఎస్‌ను నమ్ముకుని వెళ్లారు.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు

ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్లేటప్పుడు మనం గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ లొకేషన్ వాడతాము. ఇతరులను అడగే పని లేకుండా సింపుల్‌గా జీపీఎస్‌ను ఉపయోగించుకుంటాం.

  • Written By:
  • Publish Date - May 3, 2023 / 11:26 PM IST

GPS: ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్లేటప్పుడు మనం గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ లొకేషన్ వాడతాము. ఇతరులను అడగే పని లేకుండా సింపుల్‌గా జీపీఎస్‌ను ఉపయోగించుకుంటాం. అయితే ఇలా జీపీఎస్‌ను ఫాలో అవుతూ వెళ్లినప్పుడు ఒక్కొక్కసారి మనం వెళ్లాల్సిన ప్రదేశానికి కాకుండా వేరే ప్రాంతానికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. జీపీఎస్‌ను నమ్ముకుని ఇలా మోసపోయినవాళ్లు చాలామంది ఉంటారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరిగింది. తాజాగా జీపీఎస్‌ను నమ్ముకుని వెళ్లిన పర్యాటకులకు చేతు అనుభవం ఎదురైంది. జీపీఎస్‌ను నమ్ముకుని వెళ్లి నీళ్లల్లో పడి ప్రమాదానికి గురయ్యారు. కారుతో సహా నీళ్లల్లో పడిపోయారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోకి హవాయి రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. కైలువా కోన ప్రాంతంలోని హునాకోహౌ స్మాల్ బోట్ హార్బర్ లో ఇద్దరు పర్యాటకులు మాంటరే ఎక్స్‌కర్షన్ అనే ప్రాంతానికి వెళ్లేందుకు జీపీఎస్ ఆన్ చేసుకున్నారు. జీపీఎస్ చెప్పినట్లుగా ఫాలో అవుతూ కారును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. కానీ ఎస్‌యూవీ వాహనం నేరుగా హార్బర్‌లోకి వెళ్లి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో వాళ్లు సీటు బెల్తులు పెట్టుకుని ఉండటంతో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.

సముద్రంలో కారు పడటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే నీటిలోకి దూకిన కారులో చిక్కుకున్న ప్రయాణికురాలిని బయటకు తీశారు. ఆ తర్వాత కారుకు తాళ్లను కట్టి సముద్రం లోపల నుంచి బయటకు లాగారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగ్గపోవడంతో అధికారులు ఊపీరిపీల్చుకున్నారు.

అయితే కొంతమంది కారు సముద్రంలోని నీళ్లల్లోకి దూసుకెళ్లిన సంఘటనను వీడియో తీశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో ప్రయాణించేవారు అసలు తాము సముద్రం వైపు వెళుతున్నామనే సోయ కూడా లేకుండా జీపీఎస్ ను గుడ్డిగా నమ్మి వెళ్లినట్లు చెబుతున్నారు.