True Caller New Family Plan : కొత్త ఫామిలీ ప్లాన్ తెచ్చిన ట్రూ కాలర్..!

ట్రూ కాలర్ ఇప్పుడు ఒక కుటుంబానికి సరిపడా ప్లాన్ (Family Plan) తీసుకొచ్చింది.

Published By: HashtagU Telugu Desk
True Caller

True Caller

ట్రూ కాలర్ (True Caller) ఇప్పుడు ఒక కుటుంబానికి సరిపడా ప్లాన్ (Family Plan) తీసుకొచ్చింది. ఒకే ప్లాన్ ను ఐదుగురు షేర్ చేసుకోవచ్చు అని ట్రూ కాలర్ (True Caller) యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం ఒక యూజర్ కోసమే అయితే నెల వారీ రూ.39 ప్రీమియం ప్లాన్ అందుబాటులో ఉంది. ఇదే ప్లాన్ ఏడాది కోసం తీసుకోవాలంటే రూ.399 చెల్లించాలి. ప్రీమియం కనెక్ట్ ప్లాన్ కు నెల వారీ చార్జీ రూ.75, ఏడాది కోసం రూ.529 కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఫ్యామిలీ ప్లాన్ అయితే ఒక నెలకు రూ.132 చెల్లించాలి. ఏడాదికి రూ.925. ఉచిత యూజర్లతో పోలిస్తే ప్రీమియం ప్లాన్ యూజర్లు కొన్ని ప్రత్యేక సదుపాయాలు పొందుతారు. అడ్వాన్స్ డ్ స్పామ్ బ్లాకింగ్ ఒకటి. దీనిద్వారా ఎలాంటి అనుమానిత, అపరిచిత కాల్స్, సందేశాలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే, కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. మీ నంబర్ ను ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. ఇలాంటివే మరెన్నో ఫీచర్లున్నాయి.

Also Read:  Choreographer : ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య

  Last Updated: 15 Dec 2022, 04:52 PM IST