Site icon HashtagU Telugu

Traffic Rules: పోలీసులకు మీకు బైక్ నెంబర్ కనిపించకుండా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Traffic Rules

Traffic Rules

పోలీసు వారు ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు రూపొందించారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహన దారుల నుంచి హెవీ వెహికల్స్ వరకు ప్రతి ఒక్కరికి చలనా విధిస్తూ ఉంటారు. అయితే చలానాను తప్పించుకోవడం కోసం చాలామంది అడ్డదారుల్లో వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. కొందరు అడ్డదారుల్లో వెళితే ఇంకొందరు ప్యాసింజర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వారిని దింపి కొంచెం దూరం నడుచుకొని వెళ్ళిన తర్వాత మళ్లీ ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది నెంబర్ ప్లేట్ కనిపించకుండా బ్యాగు లేదా ఇతర వస్తువులు ఏవైనా అడ్డు పెడుతూ ఉంటారు.

అయితే దీనివల్ల అప్పటికి తప్పించుకున్నా కూడా భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు. నిజం చెప్పాలంటే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఇలా నెంబర్ ను కనిపించకుండా చేయడం అన్నది విరుద్ధం అని చెబుతున్నారు. ఇలా చేసిన తర్వాత కూడా చలాన్ కట్ అవుతుందట. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. చలానా భయంతో అబ్బాయి నెంబర్ ప్లేట్లను దాచి పెట్టడం లాంటివి చేస్తున్నారు చాలామంది యువత. త్రిబుల్ రైడింగ్ లేదా అంతకంటే ఎక్కువ మంది బైక్లో వెళ్ళినప్పుడు పోలీసులు ఫోటోలు తీయడానికి వీలు లేకుండా బ్యాగ్ లేదా ఇతర వస్తువులతో అడ్డు పెట్టడం లాంటివి చేస్తున్నారు.

ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని నంబర్ ప్లేట్ దాచినా లేదా ఏదైనా విధంగా తారుమారు చేసినా వాహనం జప్తు చేసే అవకాశాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. దీనితో పాటు పోలీసులు ఇలా చేసే వారికి రూ.5,000 చలాన్ కూడా జారీ చేయవచ్చట. ఎవరైనా చలాన్ జారీ చేస్తారనే భయంతో ఇలా చేస్తే, ప్రజలు అలా చేయకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. 100 లేదా 500 రూపాయలతో పోయే చలానా ఇలా నెంబర్ ను హైడ్ చేయడం వల్ల 5000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇక మీదట అలా చేయకండి. కేవలం చలానా విధించడం మాత్రమే కాకుండా వాహనం జప్తు చేసే అవకాశాలు కూడా ఉంటాయట.