Online Scams: ఆన్‌లైన్ స్కామ్స్ నుంచి మీ స్మార్ట్ ఫోన్ సేఫ్ అవ్వాలంటే.. ఈ టిప్స్ ని పాటించాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ ఆన్‌లైన్ జరిగే మోసాలు ఎక్కువ అవుతున్నాయి. చాలా వరకు మొబైల్ ఫోన్ల ద్వారానే ఇటువంటి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగు

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 03:15 PM IST

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ ఆన్‌లైన్ జరిగే మోసాలు ఎక్కువ అవుతున్నాయి. చాలా వరకు మొబైల్ ఫోన్ల ద్వారానే ఇటువంటి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ చాలామందికి ఈ విషయం తెలియక ఆన్‌లైన్ మోసాల బారిన పడుతున్నారు. అయితే మీ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ స్కామ్స్ బారిన పడకుండా సేఫ్ అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ స్కామ్స్ వారు కాస్త తెలివిగా జాబ్ ఆఫర్లు, గిఫ్ట్లు, లాటరీలు పేర్లతో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాకుండా లక్షలకు లక్షలు అమాయకులమైన ప్రజల నుంచి దోచేస్తున్నారు.

స్మార్ట్‌ ఫోన్ లకు లింక్ లేదా మెనేజ్ పంపుతూ జనాలను బురిడి కొట్టిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ స్కామ్స్ వారు పంపించిన లింకులపై క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం మాయం అవ్వాల్సిందే. మరి అటువంటి మోసాలు జరగకుండా ఉండాలంటే సైబర్ స్కామర్స్ సాధారణంగా వినియోగదారుల స్మార్ట్‌ ఫోన్ ఓఎస్‌ ను ఉపయోగించి స్కామ్‌ లకు పాల్పడుతుంటారు. ఇవి తరుచుగా CERT-In రూపంలో మిమ్మల్ని అలర్ట్ చేసేవిగా ఉండవచ్చు. ఒక నిర్దిష్ట యాప్‌లో సున్నితమైన డేటాను లీక్ చేసే విధంగా ఉండవచ్చు. అందుకే స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో స్కామ్‌ల బారిన పడే రిస్క్ తగ్గుతుంది. యాప్‌లను సైతం తాజా వెర్షన్‌లకు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అనుమానాస్పద లింక్‌లను అసలు క్లిక్ చేయకూడదు.

సైబర్ కేటుగాళ్లు స్పామ్, హానికరమైన లింక్‌లను ఎస్‌ఎంఎస్ రూపంలో తరచుగా పంపుతుంటారు. అవి లాభదాయకమైన ఆఫర్స్ రూపంలో ఉంటూ నమ్మదగినవిగా ఉంటాయి. లింక్‌ లపై క్లిక్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. అలాంటి సమయంలోనే స్మార్ట్‌ ఫోన్ యూజర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పదంగా ఉండే లింక్‌లను అసలు ఓపెన్ చేయకూడదు. ట్రూకాలర్ వంటి యాప్‌ని ఉపయోగించడం ద్వారా స్పామ్‌ని చాలావరకు ఫిల్టర్ చేయవచ్చు. కాగా సైబర్ మోసగాళ్లు ఇటీవల సిమ్ స్వాప్ ఫ్రాడ్ వంటి స్కామ్‌లకు పాల్పడుతున్నారు. ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి మీ వ్యక్తిగత వివరాలను సేకరించి, వాటి ద్వారా నకిలీ SIM కార్డ్‌ ను సృష్టిస్తున్నారు. ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే స్మార్ట్‌ ఫోన్ యూజర్లు తమ SIMను పాస్ వర్డ్ ద్వారా లాక్ చేయాలి. అలాగే ఆ పాస్‌ వర్డ్‌ను ఎవరికీ షేర్ చేయకూడదు. పాస్‌వర్డ్ మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీరు మాత్రమే మీ SIMని మరొక డివైజ్ లో యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ స్కామర్ మీ డూప్లికేట్ సిమ్‌కి యాక్సెస్ పొందినప్పటికీ, వారు నెట్‌వర్క్ సేవలను యాక్సెస్ చేయలేరు. దీంతో మీరు స్కామ్ బారిన పడటానికి అవకాశం ఉండదు.

అలాగే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు మీ ఫోన్‌లో డేటా అయిపోయి, పబ్లిక్ వైఫై ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడితే స్మార్ట్‌ఫోన్‌లో VPN యాక్సెస్ చేసుకోవాలి. ఇది స్కామ్ బారి నుంచి మీ ఫోన్‌ను రక్షిస్తుంది. విలువైన మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. దీంతో మీ డేటా చోరి కాకుండా వీపీఎన్ కాపాడుతుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఆధార్, బ్యాంకింగ్ సమాచారానికి సంబంధించిన డిజిటల్ కాపీని ఫోన్‌లో సేవ్ చేసుకుని ఉంటారు. అయితే సైబర్ అటాక్ చేసే వ్యక్తి డివైజ్‌ను హ్యాక్ చేస్తే, మీకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యమైన ఫైల్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేసేలా పాస్‌వర్డ్-ప్రొటెక్డ్ సెక్యూరిటీ ఫోల్డర్‌లో వాటిని స్టోర్ చేయాలి.