Warning Labels : ‘సోషల్’ యాప్స్‌పైనా వార్నింగ్ లేబుల్స్.. అమెరికా సర్జన్ జనరల్ వివేక్ వ్యాఖ్యలు

అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - June 18, 2024 / 12:43 PM IST

Warning Labels : అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొగాకు ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉన్నట్టే.. సోషల్ మీడియా యాప్‌లపై కూడా వార్నింగ్ లేబుల్స్‌ను డిస్‌ప్లే చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా సోషల్ మీడియా వేదికల వల్ల యువత, టీనేజీ బాలికలు చాలా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని వివేక్ మూర్తి చెప్పారు. అందుకే వాటిపై వార్నింగ్ లేబుల్స్‌ను వాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు వివరాలతో ఆయన ‘న్యూయార్క్ టైమ్స్‌’లో వ్యాసం రాశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘సోషల్ మీడియాను వినియోగించే యువత, టీనేజర్లు మానసికంగా ప్రభావితం అవుతున్నారు. వాళ్లు సోషల్ మీడియాను ఒక పరిమితికి మించి వాడినప్పుడు.. పేరెంట్స్‌ను అలర్ట్ చేసేలా వార్నింగ్ లేబుల్స్(Warning Labels) ఉపయోగపడాలి. ఈమేరకు సోషల్ మీడియా యాప్‌లలో మార్పులు చేయాల్సిన బాధ్యత ఆయా కంపెనీలపై ఉంది. దీనిపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాల్సిన అవసరం ఉంది’’ అని అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి వ్యాసంలో ప్రస్తావించారు.

Also Read :Tamanna Bathing : ప్రతి సండే నో స్నానం.. ఎందుకో చెప్పిన తమన్నా

2019 సంవత్సరంలో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ విడుదల చేసిన అధ్యయన నివేదిక ప్రకారం.. సోషల్ మీడియాలో ప్రతిరోజు సగటున మూడు గంటల పాటు గడిపే యువత డిప్రెషన్‌ రిస్క్‌ను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువతపై చెడు ప్రభావం పడకుండా నిలువరించే  చర్యలను చేపట్టే దిశగా కసరత్తును మొదలుపెట్టాయి.  ప్రత్యేకించి సోషల్ మీడియా అతి వినియోగం వల్ల తీవ్ర ఆందోళన, నిరాశ, మానసిక సమస్యలు వస్తున్నాయని అధ్యయన నివేదికలు ఘోషిస్తున్నాయి.

రెండు రాష్ట్రాల్లో కీలక ముందడుగు

  • తల్లిదండ్రుల సమ్మతి లేకుండా 18 ఏళ్లలోపు పిల్లలకు అభ్యంతరకర కంటెంట్‌ను చూపించకుండా సోషల్ మీడియా యాప్స్‌‌ను  నిలువరించేలా న్యూయార్క్ రాష్ట్ర సెనేట్  ఈ నెలలోనే  ఓ బిల్లును ఆమోదించింది.
  • 14 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వినియోగించకుండా నిషేధించే బిల్లుపై ఈ ఏడాది మార్చిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ సంతకం చేశారు. ఆ బిల్లు ప్రకారం 14, 15 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియా యాప్స్‌ను వాడేందుకు పేరెంట్స్ అనుమతిని తప్పనిసరిగా పొందాలి.