Site icon HashtagU Telugu

Mobile Network: మీ మొబైల్ లో నెట్‌వర్క్ ప్రాబ్లమా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Mobile Network

Mobile Network

మామూలుగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడే సమస్యను నెట్‌వర్క్ సమస్య. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ నెట్‌వర్క్ సమస్య తరచుగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా అలా నెట్‌వర్క్ సమస్యలను తరచుగా ఎదుర్కొంటున్నారా. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెట్‌వర్క్ సమస్య ఉన్నప్పుడు మీరు కొత్త నెట్‌వర్క్ సిగ్నల్ కోసం ప్రయత్నించవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ ఫ్లైట్ మోడ్‌ను ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి.

ఆ తర్వాత కొత్త నెట్‌వర్క్‌ లో సిగ్నల్ మెరుగుపడే అవకాశం ఉంది. మీరు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా చెడ్డ నెట్‌వర్క్ అందుతున్న స్థానానికి కొంచెం దూరంగా వెళ్ళాలి. మీరు గది లోపల ఉన్నప్పుడు మీరు కొద్దిసేపు కిటికీ దగ్గర వేచి ఉండాలి. లేకపోతే, మీరు బహిరంగ ప్రదేశానికి వెళ్లవచ్చు. ఆ తర్వాత మీకు మంచి నెట్‌వర్క్ సిగ్నల్ వస్తుంది. అలాగే మీరు ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌ లకు వెళ్లడం ద్వారా నెట్‌వర్క్‌ ను రీసెట్ చేయవచ్చు. ఇది మీకు మంచి నెట్‌వర్క్‌ ని అందించే అవకాశం ఉంది. నెట్‌వర్క్ లేకపోతే ఒకసారి ఫోన్ నుండి సిమ్‌ ని తీసివేసీ మల్లీ వేయడం మంచిది. దీంతో మళ్లీ మంచి నెట్‌వర్క్‌ వచ్చే అవకాశం ఉంది. చాలా సార్లు మొబైల్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్ బ్యాండ్ సరిగ్గా ఉండదు.

ఈ సందర్భంలో సెట్టింగ్‌లకు వెళ్లి, మాన్యువల్‌గా 3G, 4G లేదా 5G నెట్‌వర్క్‌ని ఎంచుకోవాలి. అలాగే మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కానప్పుడు చాలా సార్లు నెట్‌వర్క్ సమస్యలు వస్తాయి. అందుకే మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. నెట్‌వర్క్ చాలా బలహీనంగా ఉంటే, మరొక నెట్‌వర్క్‌కు మారండి. ఉదాహరణకు మీరు LTE నుండి 3G లేదా వైఫై నెట్‌వర్క్‌ లకు మారవచ్చు.