Site icon HashtagU Telugu

Mobile Data: మీ మొబైల్ లో డేటా తొందరగా అయిపోతోందా.. అయితే ఈ సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Data Engineer

Mobile Data

మామూలుగా మన మొబైల్ ఫోన్ ఉపయోగించినప్పుడు ఎంత చూసి వాడుకున్నా కూడా మొబైల్ డేటా త్వరగా అయిపోతూ ఉంటుంది. వీడియోస్ ఆడియోస్ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు త్వరగా డేటా అయిపోతూ ఉంటుంది. దీంతో చాలా మంది రోజులో నెట్ సరిపోక అదనంగా వన్ జీబీ 2జిబి డేటాలను వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా డేటా త్వరగా అయిపోతుంటే మొబైల్ ఫోన్లో కొన్ని రకాల సెట్టింగ్స్ ని మార్చాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫోన్‌లోని డేటాను నియంత్రించడానికి, ఫోన్ బ్రౌజర్ సెట్టింగ్‌ లకు వెళ్లి డేటా సేవర్ లేదా సేవ్ డేటా మోడ్‌ ను ఆన్ చేయాలి.

దీని తర్వాత బ్రౌజర్ సెట్టింగ్‌లలో పిక్చర్ ఇన్ పిక్చర్ ఎంపికను ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెబ్ పేజీ ఫోటోను డౌన్‌లోడ్ చేయడానికి సమయం పడుతుంది. కానీ డేటా వినియోగం తగ్గుతుంది. బ్రౌజర్ సెట్టింగ్‌ లకు వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ డేటా ఆప్షన్‌ ను ఆఫ్ చేయాలి. అలాగే స్మార్ట్ఫోన్లో డేటా వినియోగాన్ని నియంత్రించడం కోసం సెట్టింగ్స్ కి వెళ్లి నెట్వర్క్, ఇంటర్నెట్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నెట్‌వర్క్‌కి వెళ్లి తక్కువ డేటా వినియోగ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది డేటా వినియోగాన్ని తగ్గిస్తుంది. ఫోన్‌ లోని డేటాను నియంత్రించడానికి మరో సెట్టింగ్‌ ను చేయాల్సి ఉంటుంది.

దీని కోసం మీరు ఫోన్ సెట్టింగ్‌ లకు వెళ్లి, సెర్చ్‌ లో యాప్ కోసం సెర్చ్ చేసి, ఆపై యాప్ ఆప్షన్‌ లకు వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ యాప్‌ లకు వెళ్లి యాప్‌ ను క్లోజ్ చేయాలి. అలాగే ఫోన్ సెట్టింగ్లకు వెళ్లి డేటా సేవర్ మోడ్ ని సెర్చ్ చేయాలి. దీని తర్వాత ఆటో ప్లే వీడియో ఎంపికను ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్‌లో వీడియోను స్క్రోల్ చేస్తున్నప్పుడు వీడియో ప్లే కాదు. చాలా ఫోన్‌ లలో యాప్ అప్‌డేట్ ఆటో మోడ్‌ లో పనిచేస్తుంది. ఈ ఎంపికను కూడా ఆఫ్ చేయవచ్చు. దీని కోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్‌కి వెళ్లి యాప్ అప్‌డేట్ ఆప్షన్‌కు వెళ్లి ఆటో అప్‌డేట్‌ను ఆఫ్ చేయాలి.