Site icon HashtagU Telugu

Threads Profile : ఇన్‌స్టా నుంచి థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసే ఆప్షన్ ఇదిగో

Threads Profile

Threads Profile

Threads Profile : థ్రెడ్స్ యాప్‌లో ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. దాని ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌‌తో సంబంధం లేకుండా.. సెపరేట్‌గా థ్రెడ్స్ అకౌంట్ ప్రొఫైల్‌ను డిలీట్ చేసేయొచ్చు. ఇప్పటిదాకా థ్రెడ్స్ యాప్‌ను డిలీట్ చేస్తే.. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌‌ కూడా డిలీట్ అయిపోయేది. ఇక నుంచి ఆ రిస్క్ ఉండదు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌‌‌ను యథాతథంగా కొనసాగించుకుంటూనే.. థ్రెడ్స్‌ ప్రొఫైల్‌ను డిలీట్ చేసేయొచ్చు. ఈవివరాలను వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ఇన్‌స్టాగ్రామ్  వేదికగా ఒక పోస్ట్ చేశారు. యూజర్స్ నుంచి అందిన ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. థ్రెడ్స్ ప్రొఫైల్‌కు లింక్ అయి ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ కొనసాగేందుకు ఈ ఆప్షన్‌తో అవకాశం కలుగుతుందని ఆయన వివరించారు. థ్రెడ్‌ ప్రొఫైల్‌ను డిలీట్ చేయాలని భావిస్తే..  సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి, అకౌంట్స్ సెక్షన్‌లోకి ఎంటర్ కావాలి. అందులో ‘డిలీట్’, ‘డీయాక్టివేట్’ అనే రెండు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాలని భావించే వాళ్లు డీయాక్టివేట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఒకవేళ పూర్తిగా థ్రెడ్ ప్రొఫైల్‌ను తీసేయాలని అనుకుంటే డీయాక్టివేట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.

We’re now on WhatsApp. Click to Join.

థ్రెడ్స్ యాప్‌లో యూజర్స్ చేసే పోస్టులను వెంటనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించేలా చేసే ఒక ఫీచర్‌ను ఇటీవలే థ్రెడ్స్ తీసుకొచ్చింది. అయితే ఒకవేళ ఇలా థ్రెడ్స్ పోస్టులు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కనిపించడం ఇష్టంలేని యూజర్స్ కోసం కొత్త ఆప్షన్ కూడా వచ్చేసిందని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు. ఈ క్రమంలోనే థ్రెడ్స్ యాప్ వెలుపల ఫీచర్ నిలిపివేసేలా ఆప్షన్ తీసుకొచ్చింది. ఇందుకోసం అకౌంట్ సెట్టింగ్‌ సెక్షన్‌లోని ప్రైవసీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఆ వెంటనే ‘సజెస్టింగ్ పోస్ట్స్’ అనే ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. ఆ ఆప్షన్ కింద ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అనే రెండు విండోస్ కనిపిస్తాయి. ఒకవేళ ఫేస్‌బుక్‌లో మీ థ్రెడ్స్  కనిపించకూడదని భావిస్తే దాన్ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీ థ్రెడ్స్  ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించకూడదని భావిస్తే దాన్ని(Threads Profile) సెలెక్ట్ చేయండి.