Site icon HashtagU Telugu

WhatsApp : వాట్సాప్ లో అవసరం లేని ఫైల్స్ ను ఇలా డిలీట్ చేయొచ్చు..

WhatsApp Phone

Whatsapp

మనకు తెలిసిన వారు, బంధుమిత్రుల కాంటాక్ట్ ల నుంచి మన ఫోన్లోకి (Phone) ఎంతో మీడియా ఫైల్స్ (Media Files) అంటే ఫొటోలు (Images), వీడియోలు (Videos), డాక్యుమెంట్లు (Documents), జిఫ్ ఫైల్స్ (Zip Files) వచ్చి చేరుతుంటాయి. దీనివల్ల ఫోన్ స్టోరేజీ (Phone Storage) పై భారం పెరిగిపోతుంది. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేదంటే పెరిగిపోయిన ఫైల్స్ వల్ల ఫోన్ పనితీరు నెమ్మదించొచ్చు. వాట్సాప్ (WhatsApp) లో ఈ అవసరం లేని ఫైల్స్ (Unwanted Files) చెత్తను సులభంగానే డిలీట్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ (WhatsApp) యాప్ ను తెరవాలి. పైన కుడివైపున కనిపించే మూడు డాట్ల వద్ద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ సెలక్ట్ చేసుకోవాలి. అందులో మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ కు వెళ్లాలి. అప్పుడు వాట్సాప్ ఫైల్స్ డేటా (ఫోన్ మెమొరీ) కనిపిస్తుంటుంది. అక్కడ కనిపించే లార్జర్ దెన్ 5 ఎంబీ ఫైల్స్ ను క్లిక్ చేయాలి. అక్కడ ఉండే పెద్ద సైజు ఫైల్స్ లో అవసరం లేని వాటిని సెలక్ట్ చేసుకుని డిలీట్ చేయవచ్చు. అక్కడే కాంటాక్ట్ లిస్ట్ కనిపిస్తుంది. అంటే ప్రతి కాంటక్ట్ నుంచి వచ్చిన స్టోరేజీ వివరాలు ఉంటాయి. కనుక కాంటాక్ట్ వారీగా మీడియా ఫైల్స్ చూసి డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత, ఫోన్ స్టోరేజీని ఓ సారి పరిశీలించుకుని అక్కడ కూడా కనిపిస్తే డిలీట్ చేసుకోవాలి.

Also Read:  Choreographer : ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య