Buying Used Phones: సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొంటున్నారా?

పాత స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. అయితే ఒక్కోసారి ఇందులో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ గుడ్డిగా పాత ఫోన్ కూడదు.

Published By: HashtagU Telugu Desk
Buying Used Phones

Buying Used Phones

Buying Used Phones: పాత స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. అయితే ఒక్కోసారి ఇందులో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ గుడ్డిగా పాత ఫోన్ కూడదు. కొంత మంది చాలా ఏళ్ల నాటి ఫోన్లను కొని నష్టపోవాల్సి వస్తుంది. పాత ఫోన్‌ని కొనుగోలు చేస్తుంటే దాని అసలు బిల్లు మరియు వారంటీకి సంబంధించిన డాక్యూమెంట్స్ గురించి అడిగి తెలుసుకోవాలి.

స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌కు తగ్గట్టుగా కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే పాత ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులు కొందరు ఉన్నారు. పాత ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని కొన్ని తప్పులను ఇక్కడ చూద్దాం.

ఫోన్ డిస్‌ప్లే సరిగ్గా పని చేస్తుందా లేదా, ఎక్కడైనా డిస్‌ప్లే పగిలిపోయింది లేదా మరేదైనా లోపం ఉందా ఇలా ప్రతీది క్షుణ్ణంగా గమనించాలి.ఫోన్‌ను బాహ్యంగా మాత్రమే చెక్ చేస్తే సరిపోదు. సాంకేతికంగా తనిఖీ చేయడం ముఖ్యం. అంటే గతంలో ఫోన్ రిపేర్ లేదా ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజ్ గురించిన సమాచారం కూడా తీసుకోవాలి. ఇంకా మైక్, స్పీకర్, డిస్‌ప్లే, ఛార్జర్ మరియు ఇయర్‌ఫోన్ ప్లగ్‌కు సంబంధించిన విషయాలని అడిగి తెలుసుకోవాలి.

మీరు పాత ఫోన్‌ని కొనుగోలు చేస్తుంటే దాని అసలు బిల్లు మరియు వారంటీకి సంబంధించిన ప్రశ్నలను కూడా విక్రేత నుండి అడగాలి. ఇలా చేయడం ద్వారా ఫోన్‌పై ఏదైనా వారంటీ ఉందో లేదో, ఎప్పుడు ఎక్కడ కొనుగోలు చేశారో తెలుస్తుంది. ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఓఎల్ఎక్స్, ఫ్లిప్ కార్ట్ మరియు క్రోమా వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించవచ్చు. ఇక్కడ మంచి కండీషన్ ఫోన్‌లు తక్కువ ధరలకు లభిస్తాయి.

Also Read: Prabhas Kannappa : కన్నప్పకి డేట్స్ ఇచ్చిన ప్రభాస్.. మంచు విష్ణు ప్లానింగ్ అదే..!

  Last Updated: 28 Jan 2024, 05:12 PM IST