WhatsApp-Instagram: వాట్సాప్,ఇన్‌స్టాలో డిలీట్ అయిన మెసేజ్ ను చూడండిలా?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో సోషల్ మీడియా వాడకం సోషల్ మీడియా యాప్స్ వాడకం కూడా విపరీతంగా

  • Written By:
  • Publish Date - March 4, 2023 / 07:00 AM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో సోషల్ మీడియా వాడకం సోషల్ మీడియా యాప్స్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఆయా సంస్థలు ఆ సోషల్ మీడియా యాప్స్ లో కొత్త కొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది వాట్సాప్ సంస్థ. ఈ నేపథ్యంలోనే మరో ఫీచర్ ని కూడా పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ..

ఆ వివరాల్లోకి వెళితే..కాగా గూగుల్‌ స్వయంగా ఆండ్రాయిడ్‌లో విలీనం చేసిన ఓ ఫీచర్‌ ద్వారా డిలీటెడ్‌ మెసేజెస్‌ తెలుసుకోవచ్చు. తొలగించిన లేదా డిస్‌మిస్డ్‌ చేసిన రీసెంట్‌ నోటిఫికేషన్‌లను నోటిఫికేషన్ హిస్టరీలో స్టోర్‌ అయి ఉంటాయి. ఏదైనా మెసేజ్‌ నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు పక్కకు స్వైప్‌ చేస్తే అది నోటిఫికేషన్ హిస్టరీ ట్యాబ్‌ లోకి వెళ్తుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ లో డిలీటెడ్‌, అన్‌సెంట్‌ మెసేజ్‌లు డిస్‌మిస్డ్‌ మెసేజ్‌ల తరహాలోనే ప్రవర్తిస్తాయి. ఈ సెక్షన్‌లో ఆ మెసేజ్‌లను చూడవచ్చు. దాదాపు అన్ని ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో నోటిఫికేషన్ హిస్టరీకి వెళ్లే ఆప్షన్లు ఒకే విధంగా ఉంటాయి.

ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేసి, నోటిఫికేషన్స్‌ కి వెళ్లాలి. ఆ తరువాత అందులో నోటిఫికేషన్స్‌ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత నోటిఫికేషన్ హిస్టరీని ఎనేబుల్‌ చేసుకోవాలి. అప్పుడు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లలో డిలీట్‌ చేసిన మెసేజ్‌లను చూడవచ్చు. డిలీటెడ్‌ మెసేజ్‌లు ఈ ట్యాబ్‌లో 24 గంటలు మాత్రమే ఉంటాయని గుర్తించాలి. ఆ తర్వాత అవి పర్మినెంట్గా డిలీట్‌ అయిపోతాయి.