Adhaar – PAN: పాన్, ఆధార్ లింక్ అవ్వడం లేదా.. కారణం ఇదే?

ఇటీవల కాలంలో ప్రతి ఒక డాక్యుమెంట్ కి ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ అన్నది లింక్ తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానం చేపించుకోమన

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 06:18 PM IST

ఇటీవల కాలంలో ప్రతి ఒక డాక్యుమెంట్ కి ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ అన్నది లింక్ తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానం చేపించుకోమని ఇప్పటికే చాలా రోజుల నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. అయితే వీటి అనుసంధానానికి ఆఖరి తేదీ దగ్గర పడుతుంది. జూన్ 30తో ఈ గడువు కాస్త పూర్తి కానుంది. కాగా ఆదాయపు పన్ను చట్టం1961 ప్రకారం పాన్‌ ఉన్న ప్రతి వ్యక్తీ దాన్ని ఆధార్‌తో జత చేయాల్సిందే. ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించారు.

ఇప్పుడైతే రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి ఆధార్‌-పాన్‌ లింక్‌ చేసుకునేందుకు నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. ఆ గడువు కూడా ముగిశాక పాన్‌ కార్డు చెల్లుబాటు కాదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేసేందుకు ప్రయత్నించినా కొందరికి ఈ ప్రక్రియ పూర్తి కావడం లేదు. అయితే ఇందుకు డెమోగ్రఫిక్‌ వివరాలు సరిగా లేకపోవడమే కారణం కావొచ్చు అని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్వీట్‌ చేసింది.
పేరు, పుట్టిన తేదీ, జెండర్‌ విషయంలో ఎందులో తప్పులు ఉన్నా ఆధార్‌-పాన్‌ అనుసంధానం అవ్వదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

కాబట్టి పాన్‌ కార్డు, ఆధార్‌ వివరాలు సరిచేసుకోవాలని సూచించింది. పాన్‌-ఆధార్‌ పరిశీలించి రెండింట్లో ఏదో ఒక దాంట్లో మార్పులు చేసుకోవాలంది. పాన్‌ కార్డులో కరెక్షన్‌ చేయాలి అనుకుంటే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో మార్చుకునే అవకాశం ఉంది. ఆధార్‌లో తప్పుల కోసం దగ్గర లోని ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రానికి వెళ్లి సరిచేసుకోవచ్చు. సరిచేశాక మరోసారి ఐటీ పోర్టల్‌లో అనుసంధానానికి ప్రయత్నించాలని ఐటీ శాఖ సూచించింది. అప్పటికీ అనుసంధానం అవ్వకపోతే పాన్‌ సర్వీసు కేంద్రాల్లో రూ.50 చెల్లించి బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.