Site icon HashtagU Telugu

Before Bike Riding: బైక్ స్టార్ట్ చేసే ముందు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో మీకే నష్టం?

Mixcollage 10 Jul 2024 03 52 Pm 2285

Mixcollage 10 Jul 2024 03 52 Pm 2285

ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనాల వినియోగం ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి ఇంటికి కనీసం రెండు మూడు బైక్ లను వినియోగిస్తున్నారు. అయితే చాలామంది బైకుని ఉపయోగిస్తున్నప్పటికీ దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాలు తెలియదు. మరికొందరు మాత్రం వాహనాలను చాలా జాగ్రత్తగా నీట్ గా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇది బైకు వినియోగించేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు మీ వద్ద బైకు సంబంధించిన పత్రాలు మీ డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్‌ను ఎల్లప్పుడూ దగ్గర పెట్టుకోవడం మంచిది. కాగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రమాదం జరిగినప్పుడు ఈ బీమా కనీసం థర్డ్ పార్టీ బాధ్యతను కవర్ చేయాలి. బీమా లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు జరిమానా లేదా లైసెన్స్‌ ను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ ని కూడా దగ్గర పెట్టుకోవడం మంచిది.

PUC సర్టిఫికేట్‌ ను పునరుద్ధరించడంలో విఫలమైతే జరిమానా లేదా వాహన రిజిస్ట్రేషన్ నిలిపివేయవచ్చు. అలాగే చాలామంది ఇంజిన్ శబ్దాన్ని పెంచే ఎగ్జాస్ట్ మోడ్‌లు, RTO అనుమతి లేకుండా నిర్మాణ మార్పులు చేస్తుంటారు. కానీ చట్టవిరుద్ధమైన మార్పులు అన్నీ చట్టవిరుద్ధం. వాహనం రంగు మార్చుకోవాలంటే ఆర్టీఓ అనుమతి తప్పనిసరి. అయితే అధిక వేరియంట్ స్పెసిఫికేషన్‌ తో సరిపోలడానికి డీకాల్స్ జోడించడం, వింగ్‌లెట్‌ లను ఇన్‌స్టాల్ చేయడం లేదా టైర్లను అప్‌గ్రేడ్ చేయడం అనుమతి ఉంది.

ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు బైక్ నడిపితే ఎలాంటి సమస్య ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్లడం తప్పనిసరి. అలాగే ఎక్స్‌ప్రెస్ హైవేలపై ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల ప్రవేశం నిషేదించారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది ఇలాంటి రోడ్లపై వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వే మినహా ఎక్స్‌ప్రెస్‌వే లపై సాధారణంగా ద్విచక్ర వాహనాలను అనుమతి లేదు.