Whatsapp Banned : ఈ దేశాల్లో వాట్సాప్ బ్యాన్.. ఎందుకో తెలుసా ?

వాట్సాప్.. ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్.

  • Written By:
  • Updated On - June 16, 2024 / 06:36 PM IST

Whatsapp Banned : వాట్సాప్.. ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్. మన దేశంలో యథేచ్ఛగా వాట్సాప్‌ను మనం వాడుకుంటున్నాం. కానీ కొన్ని దేశాల్లో అంత స్వేచ్ఛ లేదు. వాట్సాప్ వాడుకునేందుకు అనుమతి లేదు. ఇంకొన్ని దేశాల్లో వాట్సాప్ వాడుకునేందుకు షరతులు వర్తిస్తాయి. అలాంటి దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఇప్పటివరకు ఆరు దేశాలు  వాట్సాప్‌ను బ్యాన్ చేశాయి. ఈ లిస్టులో మన పొరుగు దేశం చైనాతో పాటు ఇరాన్, యూఏఈ, ఖతార్, సిరియా, ఉత్తర కొరియా ఉన్నాయి. అయితే వాట్సాప్‌ను బ్యాన్(Whatsapp Banned) చేయడానికి ఈ ఆరు దేశాలు చెబుతున్న కారణాలు వేర్వేరు. అవేంటో మీకు ఈ కథనంలో తెలిసిపోతుంది.

Also Read : Hyderabad CCS : హైదరాబాద్‌ సీసీఎస్‌ నుంచి 12 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ.. ఎందుకు ?

అమెరికాకు చెక్.. చైనా స్వదేశీ మంత్రం

చైనా స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది. వాట్సాప్ తరహాలో అక్కడ ‘వుయ్‌ఛాట్’ అనే యాప్‌ను ప్రజలు వినియోగిస్తుంటారు. ఈ యాప్‌ను చైనా ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంటుంది.  మన దేశంలో మేడిన్ ఇండియా కాన్సెప్ట్ ఉన్నా.. అమెరికా సోషల్ మీడియా వేదికల వినియోగమే ఎక్కువగా ఉంది. చైనా మాత్రం ఈ నినాదాన్ని వాస్తవికంగా అమలు చేయడంలో సక్సెస్ అయింది. చైనీస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని గ్రేట్ ఫైర్‌వాల్ అనే సాఫ్ట్ వేర్.. ఆ దేశ పౌరులు విదేశీ యాప్‌లు, వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయకుండా కంట్రోల్ చేస్తుంటుంది.

యూఏఈలో అన్నీ ఓకే.. వాట్సాప్‌కు నో

అరబ్ దేశాల్లో ఐరోపా తరహా కల్చర్ ఉన్న దేశం యూఏఈ. ఇక్కడ క్లబ్‌లు, పబ్‌లు పెద్ద ఎత్తున ఉంటాయి. కానీ వాట్సాప్‌కు మాత్రం అనుమతి లేదు.  ఈ దేశం నుంచి మనం వాట్సాప్‌లో టెక్స్ట్ మెసేజింగ్ చేసుకోవచ్చు. కానీ వాట్సాప్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌పై బ్యాన్ ఉంది.

ఖతార్..  టెలికాం కంపెనీల కోసం.. 

అరబ్ దేశాల్లో వేగంగా మోడర్న్ రూపులోకి మారుతున్న దేశం ఖతార్. ఇక్కడ వాట్సాప్‌పై బ్యాన్ ఉంది. కానీ పాక్షికంగానే. వాట్సాప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లు ఈ దేశంలో పనిచేయవు. వాట్సాప్‌లో టెక్స్ట్ మెసేజింగ్ చేసుకోవచ్చు. తమ దేశంలోని టెలికాం కంపెనీలకు మద్దతుగా ఉండటానికి ఖతార్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read :Megastar: మెగాస్టార్ దూకుడు.. నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్

  • ఉత్తర కొరియాలో కిమ్ నియంత పాలన ఉంది. ప్రపంచంలోనే  కఠినమైన ఇంటర్నెట్ విధానాలు అక్కడ అమలవుతున్నాయి. అక్కడి ప్రజలకు ఇంటర్నెట్ అంతగా అందుబాటులో ఉండదు. వాట్సాప్‌పై పూర్తి బ్యాన్ ఉంది.
  • వాట్సాప్‌‌పై సిరియాలో బ్యాన్ ఉంది. దేశంలో జరిగే విషయాలు బయటికి చేరడం సిరియా ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే వాట్సాప్‌ను నిషేధించింది.
  • ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశాలు ఇరాన్, ఉత్తరకొరియా. అణుబాంబు విషయంలో ఇరాన్, అమెరికాల మధ్య వివాదం నడుస్తోంది. ఇరాన్‌లో వాట్సాప్‌పై పూర్తి బ్యాన్ ఉంది.