Valentine’s Day: వాట్సాప్ లో వాలెంటైన్స్ డే స్పెషల్ ఫీచర్స్.. అవేంటంటే?

ప్రతి ఏడాది ప్రేమికులు ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆరోజున వారు వారి

  • Written By:
  • Publish Date - February 13, 2023 / 06:45 AM IST

ప్రతి ఏడాది ప్రేమికులు ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆరోజున వారు వారి మనసులోని ప్రేమను వ్యక్తపరుస్తూ రకరకాల గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది ప్రేమికులు మనసుకు నచ్చిన వారిని కలుసుకునే లోపు ఒకసారి ఫోన్ ద్వారా వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది టెక్స్ట్ రూపంలో ఫోటోల రూపంలో విష్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రేమికులకు వాలెంటైన్స్ డే విషెస్ స్పెషల్ గా చెప్పడం కోసం వాట్సాప్ సంస్థ కొన్ని రకాల ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పిన్ చాట్ ఫీచర్ తో మీరు మీ వాట్సాప్ లిస్టు నుంచి మీ భాగస్వామి చార్ట్‌ను పిన్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీన్ని ట్యాప్ చేయడం, పిన్ ట్యాప్ చేయడం ద్వారా చేయవచ్చు. అలాగే ఎమోజి రియాక్షన్.. అలాగే వాలంటైన్స్ డే రోజు మీ భాగస్వామి మీపై సరైన శ్రద్ధ చూపడం లేదని మీరు అనుకున్నట్లయితే అలాంటి సందేహాలకు స్వస్తి చెప్పేందుకు ఎమోజీలు బెస్ట్ ఆప్షన్. ఎమోజి ప్రతిచర్యల ద్వారా మీ భాగస్వామి సందేశాలను గుర్తించడంలో వాట్సాప్ మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు మీ స్టేటస్‌ను వాట్సాప్ లో కూడా షేర్ చేయవచ్చు. మీ ప్రియమైన వ్యక్తి కోసం ఒక రొమాంటిక్ స్టిక్కర్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా స్టేటస్‌గా షేర్ చేయవచ్చు. అదేవిధంగా వాయిస్ సందేశాలు..మీ భాగస్వామికి మీరు వాట్సాప్‌తో వాయిస్ నోట్‌ని పంపించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వారి వాయిస్‌ని మీరు వినవచ్చు.

మీ భాగస్వామి మీకు ఎంత ముఖ్యమో వ్యక్తీకరించడానికి ముందు మీరు మరిన్ని ఆలోచనలతో ఒక చక్కటి వాయిస్ రికార్డు చేసి పంపించవచ్చు. అలాగే మీరు ఈ ప్రేమికుల రోజున మీ ప్రియమైన వ్యక్తి కోసం అనుకూల నోటిఫికేషన్ టోన్‌ను సెటప్ చేయవచ్చు. దాని ద్వారా వారు ఎప్పుడు కాల్ చేస్తారో మీరు తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు వారి కాంటాక్ట్ మెసేజ్ పై క్లిక్ చేసి, వాల్‌పేపర్, సౌండ్ టోన్‌ను మార్చాలి. అలాగే లైవ్ లొకేషన్.. మీరు మీ భాగస్వామిని కలవాలని ప్లాన్ చేసి, ఒకరినొకరు ఎక్కడ కలుసుకోవాలని అనుకున్నట్లయితే లైవ్ లొకేషన్ మీకు చక్కగా హెల్ప్ చేస్తుంది. ఈ లైవ్ లొకేషన్ ద్వారా మీ భాగస్వామి ఎక్కడున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు.