Smartwatches: రూ.3 వేలకే అద్భుతమైన స్మార్ట్ వాచ్ లు.. ఫీచర్స్ అదుర్స్ ?

ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో పాటు స్మార్ట్ వాచ్ ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

  • Written By:
  • Publish Date - March 30, 2023 / 06:30 AM IST

ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో పాటు స్మార్ట్ వాచ్ ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్ లపై ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వాచ్ ల కొనుగోలుదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీలు మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్ వాచ్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే తాజాగా మార్కెట్ లోకి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ వాచ్ లు కూడా విడుదల అయ్యాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. రెడ్‌మి వాచ్ 2 లైట్ బడ్జెట్ స్మార్ట్‌ వాచ్‌ల విషయానికి వస్తే.. రెడ్‌మి వాచ్ 2 లైట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ కాంపాక్ట్ స్మార్ట్‌వాచ్ విభిన్న రంగు ఎంపికలలో లభిస్తుంది. 2.5డీ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 1.55 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌లో హృదయ స్పందన సెన్సార్, SpO2 సెన్సార్ ఉంటుంది. నిద్రను ట్రాక్ చేయకలుగుతుది. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ ఉంది. 100 రకాల వ్యాయామ ట్రాకింగ్‌లకు మద్దతు ఇస్తుంది. దీని ధర రూ. 2,499గా ఉంది. అలాగే అమాజ్‌ఫిట్ బిప్ 3.. ఈ వాచ్ 1.69 అంగుళాల డిస్‌ప్లే తో వస్తుంది. ఆపిల్ వాచ్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. పూర్తి వాటర్ ప్రూఫ్ బాడీ ఉంటుంది. క్రికెట్‌తో సహా 60 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది.

దీనికి జీపీఎస్ ట్రాకింగ్ లేనప్పటికీ, ఇది నమ్మకమైన హృదయ స్పందన సెన్సార్‌ను అందిస్తుంది నిద్రను ట్రాక్ చేయగలదు. కాగా ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 1,999గా ఉంటుంది.బోట్ ఎక్స్‌టెండ్.. ఈ స్మార్ట్ వాచ్ 1.69 అంగుళాల టచ్ డిస్‌ప్లే రొటేటబుల్ క్రౌన్‌తో ఉంటుంది. ఇది ప్రీమియం ఆపిల్ వాచ్‌లో మాదిరిగానే ఉంటుంది. దీనికి జీపీఎస్ ట్రాకింగ్ లేనప్పటికీ, ఇది హృదయ స్పందన సెన్సార్, SpO2 సెన్సార్‌ను అందిస్తుంది. అంతర్నిర్మిత అమెజాన్ అలెక్సా ను కలిగి ఉంది. దీనిని ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్ లతో అనుసంధానించి వాడవచ్చు. దీని ధర రూ. 1,799గా ఉంది. మరో స్మార్ట్ వాచ్.. రియల్ మీ స్మార్ట్ వాచ్ 2 ప్రో.. ఈ స్మార్ట్ వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఇది హెచ్ డీ రిజల్యూషన్‌తో కూడిన 1.75 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్‌ ఫీచర్ ఉంది. ఒక ఫుల్ చార్జ్ పై దీనిలోని బ్యాటరీ తొమ్మిది రోజుల పాటు వినియోగించుకునే వీలుంటుంది. దీని ధర రూ. 2984గా ఉంది.