Top 10 AI Tools : తప్పకుండా వాడాల్సిన టాప్ – 10 ‘ఏఐ టూల్స్’

Top 10 AI Tools : కంప్యూటర్ యుగం ఇది. ఈ యుగంలో ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 09:33 PM IST

Top 10 AI Tools : కంప్యూటర్ యుగం ఇది. ఈ యుగంలో ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. ప్రతీ రంగం ఏఐ టెక్నాలజీని స్వేచ్ఛగా వాడేస్తోంది. రక్షణ రంగం నుంచి వైద్య రంగం దాకా అన్నీ ఏఐమయంగా మారబోతున్నాయి. రోజూ సోషల్ మీడియాలో మునిగితేలే నెటిజన్లు కూడా ఏఐ టెక్నాలజీని వాడటం నేర్చుకుంటున్నారు. చాలా సోషల్ మీడియా యాప్‌లలో ఏఐ ఫీచర్లు చాలానే అందుబాటులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో వాటి సంఖ్య మరింత పెరుగుతుంది. ఈనేపథ్యంలో అందరికీ ఉపయోగపడే టాప్​-10 ఏఐ టూల్స్ (Top 10 AI Tools) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

GITA GPT

భగవద్గీతను చదివేవారికి GITA GPT ఏఐ టూల్ ఉపయోగపడుతుంది. భగవద్గీతకు సంబంధించి మనకు ఉండే డౌట్స్‌ను ఇది క్లియర్ చేస్తుంది. గీతా జీపీటీని ఓపెన్ చేసి, భగవద్గీతకు సంబంధించి మీ వద్దనున్న ప్రశ్నను టైప్ చేయాలి. వెంటనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది.

Pop AI

పాప్​ ఏఐ టూల్ అనేది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థుల దగ్గరున్న ఒక పాఠానికి సంబంధించిన పీడీఎఫ్‌ను పాప్​ ఏఐ టూల్​లో అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత దానికి సంబంధించిన ప్రశ్నలను టైప్ చేయాలి.  ఆ వెంటనే మనకు తగిన సమాధానం వచ్చేస్తుంది. దీన్ని ఉపయోగించి మన అకడమిక్ స్టడీస్​కు సంబంధించిన నోట్స్‌ను ప్రిపేర్ చేసుకోవచ్చు.

Super Meme AI

Super Meme AI టూల్​తో ఈజీగా మీమ్స్‌ను తయారు చేయొచ్చు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి, యూజర్లను అట్రాక్ట్ చేయొచ్చు.

Luma AI

లూమా ఏఐ టూల్ చాలా బాగుంటుంది. దీన్ని ఉపయోగించి మనం సాధారణ వీడియోను 3డీ మూవీగా మార్చేయొచ్చు.

Durable

కొంతమంది చిన్నచిన్న బిజినెస్​ల కోసం సొంత వెబ్​సైట్ నిర్మించాలని అనుకుంటారు. అలాంటి వారికి డ్యూరబుల్ ఏఐ టూల్ ఉపయోగపడుతుంది. ఈ టూల్‌తో కొన్ని నిమిషాల్లోనే మనకు నచ్చిన వెబ్​సైట్​ను క్రియేట్ చేసుకోవచ్చు.

Trip Club

ట్రావెలింగ్ అంటే చాలామందికి ఇష్టం. అలాంటివారికి ట్రిప్ క్లబ్ ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ టూల్‌ను తెరిచి.. మీరు వెళ్లాలని భావించే లొకేషన్​ పేరును ఎంటర్ చేయాలి. మీరు ఏయే తేదీల్లో.. ఆ లొకేషన్‌కు వెళ్లాలని అనుకుంటున్నారో కూడా పొందుపర్చాలి. ఆ వెంటనే మీ బడ్జెట్, అవసరాలకు సరిపోయే టూర్​ ప్లాన్​ను ట్రిప్ క్లబ్ సిఫారసు చేస్తుంది.

Microsoft Copilot

మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఏఐ టూల్‌ ద్వారా కమాండ్స్ ఇచ్చి మనం ఇమేజెస్​‌ను క్రియేట్ చేయొచ్చు. ఇది ఉచితంగా లభిస్తున్న పర్సనల్ అసిస్టెంట్ లాంటిది. దీని ద్వారా మన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు.

Tidal Flow

ఈ టైడల్ ఏఐ టూల్ అనేది మీకు ఒక పర్సనల్ ట్రైనర్​లాగా పనిచేస్తుంది. ఇందులో మీ శరీర కొలతలు, మీ ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాలు ఇస్తే, మీకు ఎలాంటి వ్యాయామాలు అయితే మంచిదో తెలుపుతుంది.

Wisely

ఒర్జినల్, డూప్లికేట్​ డివైజ్​లను గుర్తించేందుకు వైజ్​లీ ఏఐ టూల్ ఉపయోగపడుతుంది. మీరు ఆన్​లైన్​లో ఏదైనా వస్తువును కొనాలని అనుకుంటే.. దాని వివరాలను వైజ్​లీ ఏఐ టూల్​లో పేస్ట్ చేయాలి. ఆ వెంటనే సదరు డివైజ్ అసలుదా ? నకిలీదా? అనేది తేలుతుంది.

Autodraw AI

ఆటోడ్రా ఏఐ టూల్‌ను వినియోగించి మనం బేసిక్ డ్రాయింగ్‌లు వేయొచ్చు. పూర్తిగా డ్రాయింగ్ చేయలేనివారు.. దీని ద్వారా మనస్సులోని భావాలకు డ్రాయింగ్‌గా మార్చుకోవచ్చు.

Also Read : Muthu Song : ‘ముత్తు’ పాటను పాడుతూ జపాన్ పెద్దాయన డ్యాన్స్.. వీడియో వైరల్