Site icon HashtagU Telugu

Second Hand Phone: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

Mixcollage 18 Dec 2023 04 08 Pm 7759

Mixcollage 18 Dec 2023 04 08 Pm 7759

మామూలుగా మనలో చాలామంది సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కొత్త ఫోన్లు కొనే బడ్జెట్ లేకపోవడంతో సెకండ్ హ్యాండ్ లో ఫోన్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయడం మంచిదే కానీ వాటిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. సెకండ్ హ్యాండ్ ఫోన్ల కొనుగోలు చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మోసపోయే అవకాశం ఉంది. అందుకే కొన్ని అంశాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ ఫోన్ పరిస్థితి ఎలా ఉంది? ఫిజికల్ గా ఫోన్ డ్యామేజ్ ఏమైనా ఉందా అనేది తనిఖీ చేసుకోవాలి.

అంతేకాక సాఫ్ట్ వేర్ పరంగా కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేసే ముందు ఇంకా ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫోన్ కొనుక్కునేటప్పుడు ముందుగా ఫోన్ పరిస్థితి ఎలా ఉంది. గీతలు, డెంట్‌లు లేదా పగుళ్లు వంటి ఏవైనా దెబ్బతిన్న సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఫోన్‌ని నిశితంగా పరిశీలించాలి. అటువంటివి ఏమైనా ఉంటే ఫోన్ విలువ తగ్గించి కొనుగోలు చేసుకోవచ్చు.

అలాగే ఆ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఆ ఫోన్ ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎన్ని రోజులు ఉపయోగించారు లాంటి విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఫోన్ ఇప్పటికీ వారంటీలో ఉందో లేదో అడగాలి. వారంటీ ఉంటే మీకు అది అదనపు అడ్వాంటేజీ అవుతుంది. ఫోన్ అనుకూలత ఫోన్ మీ క్యారియర్, నెట్‌వర్క్‌కి అనుకూలంగా ఉందని నిర్ధారించుకోవాలి. మీ క్యారియర్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఫోన్ అనుకూలతను తనిఖీ చేయవచ్చు మీకు ఆసక్తి ఉన్న ఫోన్‌కు సరసమైన ధర ఎంత ఉందో తెలుసుకోవడానికి కొంత పరిశోధన చేయాలి.అలాగే ఆన్‌లైన్ ధర పోల్చి సరిచూసుకోవచ్చు.
ఐఎంఈఐ నంబర్ మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఐఫోన్ ఐఎంఈఐ నంబర్ తెలుసుకోవాలి. దాని కోసం ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి చూడవచ్చు.

జనరల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అబౌట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఆ ఫోన్ దొంగిలించిందా లేదా అని తెలుసుకొనే వీలుంటుంది. సీరియల్ నంబర్ అనేది ఐఫోన్ కు ప్రత్యేక ఐడెంటిఫైయర్. మీరు సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా ఈ నంబర్ ను కనుగొనవచ్చు. ఇది జనరల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అబౌట్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. దీనివల్ల అది వారంటీలో ఉందో లేదో కొనుగొనొచ్చు. ఫోన్ ఐఓఎస్ తాజా వెర్షన్‌తో నడుస్తోందని నిర్ధారించుకోవడం ముఖ్యం. దానిని తెలుసుకునేందుకు జనరల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సాఫ్ట్ వేర్ వెర్షన్ ను తనిఖీ చేయాలి. ఫోన్ బ్యాటరీ ఆరోగ్యాన్ని తనిఖీ చేయండి. దీని కోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని బ్యాటరీ హెల్త్ లోకి వె ళ్లి తనిఖీ చేసుకోవచ్చు.