Instagram: ఇన్‌స్టాలో మీకు నచ్చిన వారు మాత్రమే స్టోరీ చూసేలా చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి?

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, అలాగే స్మార్ట్ ఫోన్ వ

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 08:00 PM IST

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఇంస్టాగ్రామ్ తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ఈ సోషల్ మీడియా యాప్ కూడా వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకునేందుకు గట్టిగానే కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే పదుల సంఖ్యలో ఇంస్టాగ్రామ్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా మాములుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, రీల్స్‌ పోస్ట్‌ చేయడం, స్టోరీ లు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం.

కొందరు మాత్రం స్టోరీలు పెట్టడానికి సంకోచిస్తుంటారు. గోప్యతను దృష్టిలో పెట్టుకొని వీటిని ఎక్కువగా వినియోగించరు. అయితే, పోస్టుల మాదిరిగానే స్టోరీలకూ ప్రైవసీ ఎంచుకొనే సదుపాయం ఉంది. మిమ్మల్ని ఫాలో అవుతున్న వారిలో కొందరికి స్టోరీ కనిపించకూడదు. అలాగని వారిని అన్‌ఫాలో చేయకూడదనుకున్న సందర్భంలో ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇందుకోసం సాధారణంగా వాడే క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌ ఆప్షన్‌ కూడా ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి పైన కుడివైపు ఉన్న మూడు గీతల సింబల్‌పై ట్యాప్‌ చేసి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్‌ ఎంచుకోవాలి.

కిందకు స్క్రోల్ చేయగానే Who can see your content అనే ట్యాబ్‌లో హైడ్ స్టోరీ అండ్ లైవ్ ఆప్షన్‌ను ట్యాప్‌ చేయాలి. అప్పుడు వెంటనే మీరు ఫాలో అవుతున్న అకౌంట్‌ జాబితా ప్రత్యక్షమవుతుంది. అందులో స్టోరీ చూడాలనుకున్న వారిని మాత్రమే ఎంచుకుంటే సరిపోతుంది. అంతే ఇలా చేస్తే చాలు మీ నీ ఇంస్టాగ్రామ్ స్టోరీ మీరు కావాలి అనుకున్న వారు మాత్రమే చూస్తారు.