Most Secure Smartphones : ఐఫోన్ కంటే సెక్యూర్డ్ స్మార్ట్‌ఫోన్లు ఇవీ..

Most Secure Smartphones : ఐఫోన్ అంటే సెక్యూరిటీకి కేరాఫ్ అడ్రస్.

  • Written By:
  • Updated On - December 2, 2023 / 09:19 AM IST

Most Secure Smartphones : ఐఫోన్ అంటే సెక్యూరిటీకి కేరాఫ్ అడ్రస్. ఐఫోన్ కంటే మెరుగైన భద్రత కలిగిన స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి గురించి చాలామందికి తెలియదు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

సిరీన్ ల్యాబ్స్ ఫిన్నే యూ1

  • ‘సిరీన్ ల్యాబ్స్ ఫిన్నే యూ1’ .. ప్రపంచంలోనే మొట్టమొదటి సైబర్ సెక్యూర్ బ్లాక్‌చెయిన్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్.
  • ఈ ఫోన్ ధర దాదాపు రూ. 75,000.
  • స్మార్ట్‌ఫోన్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టం (IPS) సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
  • గూగుల్ మాడిఫైడ్ ఆండ్రాయిడ్ వెర్షన్‌పై పనిచేస్తుంది.
  • స్మార్ట్‌ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈ-మెయిల్స్‌కు రియల్ టైమ్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది.

ప్యూరిజం లిబ్రెం 5 

  • ‘ప్యూరిజం లిబ్రెం 5’.. ఈ ఫోన్ లైనక్స్ ఆధారిత ప్యూర్ ఓఎస్‌పై పనిచేస్తుంది.
  • ఈ ఫోన్ ధర దాదాపు రూ. 83,300.
  • బ్లూటూత్, వైఫై, సెల్యులార్ సిగ్నల్స్ వంటి వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను డిజేబుల్ చేయడానికి ‘ఫిజికల్ కిల్ స్విచ్’ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంది.
  • స్మార్ట్ ఫోన్‌లోని కెమెరా, మైక్రోఫోన్‌ను పూర్తిగా నిలిపివేయడానికి కూడా ఇది కిల్ స్విచ్‌తో వస్తుంది.
  • ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సంబంధిత కంట్రోల్స్‌ను అందిస్తుంది. దీని కారణంగా వాటిని ఎవరూ ట్రాక్ చేయలేరు.

బిట్టియం టఫ్ మొబైల్ 2 

  • ‘బిట్టియం టఫ్ మొబైల్ 2’..  ఈ ఫోన్ ఫిన్‌లాండ్‌లో తయారవుతుంది.
  •  దీని ధర దాదాపు రూ.1,44,500.
  • అత్యుత్తమ భద్రత, ట్యాంపర్ ప్రూఫ్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు.
  • స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ కనెక్షన్ల కోసం హార్డ్‌వేర్ ఆధారిత ప్రైవసీ మోడ్‌ను కలిగి ఉంది.
  • బిట్టియం సెక్యూర్ కాల్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది.
  • ఆడియో, వీడియో కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సపోర్ట్ చేస్తుంది.

కటిమ్ ఆర్01 

  • ‘కటిమ్ ఆర్01’.. ఇది ఒక రఫ్ అండ్ టఫ్ ఫోన్.
  • దీని ధర  దాదాపు రూ.91,700.
  • ఈ ఫోన్ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌తో కూడిన సురక్షిత ప్రదేశంలో మొత్తం డేటాను నిల్వ చేస్తుంది.
  • యూజర్ తన డేటాను యాక్సెస్ చేయాలంటే పాస్‌కోడ్ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం.
  • ఈ ఫోన్‌లోని యూఎస్బీ ఇంటర్‌ఫేస్ మాల్వేర్ డేటా థెఫ్ట్ నుంచి రక్షిస్తుంది.
  • ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌పై(Most Secure Smartphones) పని చేస్తుంది.

Also Read: Historical Churches : క్రిస్మస్ వేళ చారిత్రక చర్చిల విశేషాలివీ..