Smartphone: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సరిగా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండిలా?

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఏ రేంజ్ లో అందరికీ తెలిసిందే. రోజురోజుకీ స్మార్ట్ ఫోన్లో వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉం

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 04:30 PM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఏ రేంజ్ లో అందరికీ తెలిసిందే. రోజురోజుకీ స్మార్ట్ ఫోన్లో వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మనుషులు కూడా స్మార్ట్ ఫోన్ లోకి బాగా అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే మనుషుల లైఫ్ లో మొబైల్ కూడా ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ నీ ఉపయోగించడం మాత్రమే కాదు. ఎప్పటికప్పుడు ఫోన్‌ పనితీరును తెలుసుకోవడం కూడా తప్పనిసరి. ఈ క్రమంలోనే మీరు ఉపయోగిస్తున్న ఫోన్‌ బ్యాటరీ ఎలా ఉంది? సరిగా పని చేస్తుందా లేదా అన్న విషయాలను తెలుసుకోవడం కూడా తప్పనిసరి.

మరి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సరిగా పనిచేస్తుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే మీ ఫోన్‌ గత 24 గంటల బ్యాటరీ వినియోగం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, బ్యాటరీ ఆప్షన్‌కు వెళ్లాలి. గత 24 గంటల్లో బ్యాటరీ వినియోగం ఎంత ఉందో, ఏ యాప్ ఎక్కువ బ్యాటరీని వినియోగించిందో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు శాంసంగ్ బ్రాండ్‌కు చెందిన ఫోన్‌ను ఉపయోగిస్తుంటే.. ప్లే స్టోర్ నుంచి శామ్‌సంగ్ మెంబర్ యాప్ ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ని అసిస్టెంట్ ట్యాబ్ కింద సపోర్ట్ కి వెళ్లి ఫోన్ డయాగ్నోస్టిక్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు మీ బ్యాటరీకి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది.

ఇతర కంపెనీలకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారు బ్యాటరీ హెల్త్‌ను తెలుసుకోవాలంటే ప్లేస్టోర్‌ నుంచి AccuBattery అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ఫోన్‌ను ఫుల్ ఛార్జ్‌ చేయాలి. తర్వాత యాప్‌ పనిచేయడం ప్రారంభించి, మీ బ్యాటరీ హెల్త్‌ను మీకు అందిస్తుంది. ఇక మీ ఫోన్‌ డయల్‌ను ఉపయోగించి కూడా ఫోన్‌ బ్యాటరీ పనితీరును తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా డయల్‌ను ఓపెన్‌ చేసి ##4636## ని ఎంటర్‌ చేయాలి. మెనూలో బ్యాటరీ ఇన్ఫర్మేషన్‌ను సెలక్ట్ చేసుకుంటే.. ఛార్జింగ్ లెవల్‌తో పాటు బ్యాటరీ టెంపరేచర్‌, హెల్త్‌ ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు. మీ ఫోన్ బ్యాటరీ హెల్త్‌ను తెలుసుకోవడానికి CPU-Z అనే యాప్‌ కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల బ్యాటరీ ఇంక ఎంతసేపు వస్తుంది, బ్యాటరీ హెల్త్‌ ఎలా ఉంది.? టెంపరేచర్‌ ఎంత ఉంది? లాంటి వివరాలను మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.