Tech Tips: మీ ఫోన్ లో బ్యాటరీ త్వరగా అయిపోతోందా.. అయితే ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే చాలు?

మామూలుగా మొబైల్ ఫోన్ లో కొత్తలో చార్జింగ్ బాగా వస్తాయి. కానీ రాను రాను మొబైల్ యూజ్ చేసే కొద్దీ ఫోన్ లో త్వరగా చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ఫోన

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 02:35 PM IST

మామూలుగా మొబైల్ ఫోన్ లో కొత్తలో చార్జింగ్ బాగా వస్తాయి. కానీ రాను రాను మొబైల్ యూజ్ చేసే కొద్దీ ఫోన్ లో త్వరగా చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ఫోన్ కొన్నా మొదట్లో 100% చార్జింగ్ ఒకరోజు లేదా రెండు రోజులు వస్తే మొబైల్ పాత బడే కొద్దీ 100% చార్జింగ్ ఒకరోజు లేదంటే కొన్ని గంటలు మాత్రమే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సెల్ ఫోన్ తయారీ సంస్థలు సూచించిన నియమాలను పాటించాలి. వాటితో పాటుగా టేక్ నిపుణులు చెప్పిన సలహాలను కూడా పాటించాలి. మరి మీ ఫోన్ కూడా త్వరగా బ్యాటరీ అయిపోతుంటే అటువంటి అప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ ఫోన్ వినియోగదారులు 85% చార్జ్ కాగానే వెంటనే చార్జర్ వైర్ ను రిమూవ్ చేయాలని ఆ సంస్థ సూచిస్తోంది. అయితే ఇది మనం తరచూ మాన్యువల్ గా పర్యవేక్షించడం కష్టతరమవుతుంది. అయితే ఫోన్లలోనే శాంసంగ్ ఒక ఆప్షన్ ను అందించింది. శాంసంగ్ గెలాక్సీ వినియోగదారులకు వారి ఫోన్లలోని సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి అన్న విషయానికి వస్తే. మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే దానిని పూర్తిగా చార్జ్ చేయవద్దు. అలాగే పూర్తిగా బ్యాటరీ అయిపోనివ్వొద్దు. శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల వినియోగదారులైతే దానిని కేవలం 85శాతం వరకూ మాత్రమే చార్జ్ చేయాలని శాంసంగ్ సూచిస్తుంది.

అయితే ఇది మనం తరచూ మాన్యువల్ గా పర్యవేక్షించడం కష్టతరమవుతుంది. అందుకే ఫోన్లలోనే శాంసంగ్ ఒక ఆప్షన్ ను అందించింది. దీనిని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ 85 శాతం చార్జింగ్ పూర్తి కాగానే ఆటోమేటిక్ గా బ్యాటరీ చార్జింగ్ ఆగిపోతుంది. మీ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో బ్యాటరీ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని దానిలో ప్రోటెక్ట్ బ్యాటరీని ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత దానిని 85 శాతానికి లిమిట్ చేసుకోవాలి. ఫాస్ట్ చార్జింగ్ మోడ్ లో ఫోన్ విపరీతంగా వేడిని గ్రహిస్తుంది. ఫోన్ మొత్తం వేడిగా అయిపోతోంది. ఇది దీర్ఘకాలంలో బ్యాటరీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ ను నిలివేయడం ద్వారా ఛార్జింగ్ చేసేటప్పుడు అధిక వేడిని నిరోధించవచ్చు. దీని ఫలితంగా బ్యాటరీ ఆరోగ్యాన్ని పొడిగించవచ్చు. అలాగే మీ ఫోన్ వైర్ లెస్ చార్జింగ్ సపోర్టు చేసినా అది కూడా మీ ఫోన్ మరింత వేడిగా అయిపోయేలా చేస్తుంది.

దీని కోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ లోకి వెళ్లి ఆ తర్వాత చార్జింగ్ ఆప్షన్ లోకి వెళ్లి ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ ను నిలిపివేయాలి. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్ చార్జింగ్ కు ఎక్కువ సమయం తీసుకుంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి. అలాగే మీ ఫోన్ లో వినియోగించని చాలా యాప్స్ బ్యాక్‌ గ్రౌండ్‌లో రన్ అవుతాయి. మీరు వాటిని ఉపయోగించకపోయినా, అవి శక్తిని వినియోగించుకుంటాయి. కాబట్టి అలా ఉపయోగించని యాప్‌లను నిద్రపోయేలా ఎనేబుల్ చేయాలి. మీరు కొంతకాలంగా తెరవని యాప్‌లను స్మార్ట్‌ ఫోన్ విశ్లేషిస్తుంది. వాటిని స్వయంచాలకంగా నిద్రపోయేలా చేస్తుంది. అందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని బ్యాక్ గ్రౌండ్ యూసేజ్ లిమిట్ పై క్లిక్ చేసి, అన్ యూజ్డ్ యాప్స్ ను స్లీప్ లో పెట్టవచ్చు.