Best 5g Phones : రూ. 20 వేల‌లోపు వ‌చ్చే బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..!

రూ. 20వేలలోపు మంచి కెమెరా, ఫెర్ఫార్మెన్స్ ఉండే 5జీ స్మార్ట్‌ఫోన్ల‌ను ప్ర‌ముఖ కంపెనీలు ప్ర‌కటించాయి.

  • Written By:
  • Publish Date - October 7, 2022 / 07:30 AM IST

రూ. 20వేలలోపు మంచి కెమెరా, ఫెర్ఫార్మెన్స్ ఉండే 5జీ స్మార్ట్‌ఫోన్ల‌ను ప్ర‌ముఖ కంపెనీలు ప్ర‌కటించాయి. మార్కెట్లో రోజుకో 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది. రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో అసలు ఏ ఫోన్ ఎంపిక చేసుకోవాలో చాలామందికి సందేహం ఉంటుంది. ఈ క‌థ‌నంలో రూ. 20వేల‌లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల వివరాలను అందిస్తున్నాం.

వ‌న‌ప్ల‌స్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ:

ఎంతో కాలం నుంచి వేచిచూస్తున్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ భార‌త్ మార్కెట్‌లోకి వచ్చేసింది. రూ.20వేలలోపు ధర రేంజ్‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ (OnePlus Nord CE 2 Lite 5G) ఫోన్‌.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో OnePlus Nord CE 2 Lite 5G రూ.19,999కే మార్కెట్‌లో ల‌భిస్తుంది. 64మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

రియ‌ల్‌మీ 9 స్పీడ్ ఎడిష‌న్ 5జీ:

రియల్‌మీ 9 స్పీడ్ ఎడిషన్ (Realme 9 SE) కూడా ప్ర‌స్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉంది. రియల్‌మీ 9 ఎస్ఈ ప్రత్యేకతలు చూస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉండటం విశేషం. దీంతో పాటు 144Hz డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రూ.19,999కే రియల్‌మీ 9 ఎస్ఈ 5జీ మోడల్ ల‌భిస్తోంది. ఇందులో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.

వీవో టీ1 5జీ:

వివో టీ1 5జీలో సిల్కీ వైట్ వేరియంట్ ప్ర‌స్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ వివో టీ1 5జీలో అందించారు. 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంది.
వివో టీ1 5జీలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990గానూ నిర్ణయించారు.

మోటో జీ71 5జీ:

మోటోరోలా ఇండియా మోటో జీ71 5జీ (Moto G71 5G) స్మార్ట్‌ఫోన్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో లేటెస్ట్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఉండటం విశేషం. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో రిలీజ్ అయిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 15,999కే ల‌భిస్తోంది.

రెడ్‌మీ నోట్ 11టీ 5జీ:

ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G) మొబైల్‌ భారత్ మార్కెట్‌లో ల‌భిస్తోంది. రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లేతో రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ఉంది. 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఆరు నానో మీటర్ల మీడియాటెక్ డైమంసిటీ 810 ఎస్ఓసీ 5జీ ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ నడుస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టం ఆ ఫోన్లో ఉంది. డిస్‌ప్లేకు రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంది. యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో ఈ మొబైల్‌ వస్తోంది. రూ. 17,999కే ఈ 5జీ మొబైల్ మార్కెట్‌లో ల‌భిస్తోంది.