Best 5G Smartphones: తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఒకసారి ఈ లిస్టు చూడాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో 5జీ స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో మొబైల్ తయారీ సంస్థలు కూడా తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగి

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 06:30 PM IST

ప్రస్తుత రోజుల్లో 5జీ స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో మొబైల్ తయారీ సంస్థలు కూడా తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు కూడా తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే మీరు కూడా 5జీ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలి అనుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంచి 5జీ స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్ 5జీ.. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కంపెనీ సొంత ఆక్సిజన్‌ఓఎస్ 13 తో ఫోన్ నడుస్తుంది. ఇది 200% అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ ల కోసం 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా అందించారు.

రెడ్ మీ నోట్ 13 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ మాలి జీ57 జీపీయూతో అనుసంధానమైన మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని మునుపటి ఫోన్ తో పొలిస్తే ఈ కొత్త అప్ డేటెడ్ ఫోన్ లో కెమెరాల పరంగా అప్ గ్రేడ్ ను పొందుతుంది. దీనిలో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 12ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఉండనుంది. 33 వాట్ల చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐపీ 54 స్ప్లాష్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్‌గా ఈ ఫోన్ ఉంటుంది.

ఐకూ జెడ్ 7ఎస్ 5జీ.. ఈ ఫోన్లో 6.38-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం16-మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ స్పేస్ తో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

రియల్ మీ 11 5జీ.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6.72-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ శామ్సంగ్ అమోల్డ్ డిస్‌ప్లే,120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 240హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీతో పాటు 8జీబీ ర్యామ్ ఉంటుంది. వెనుకవైపు 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు, 2ఎంపీ సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 67వాట్ల సూపర్ వీఓఓసీ చార్జింగ్ టెక్నాలజీతో కేవలం 17 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం రీచార్జ్ చేస్తోంది.

గెలాక్సీ ఎం34.. దీనిలో 6.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఎక్సినోస్ 1280ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ ఉంటుంది. అలాగే వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండేది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.