Site icon HashtagU Telugu

Smartwatches: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న సరికొత్త స్మార్ట్ వాచ్లు.. ధర వివరాలివే?

Mixcollage 20 Dec 2023 08 40 Pm 2600

Mixcollage 20 Dec 2023 08 40 Pm 2600

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో పాటు స్మార్ట్ వాచ్ ల వినియోగం కూడా పెరిగిపోయింది. దాంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది స్మార్ట్ వాచ్ ని వినియోగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు మాత్రమే కాకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్లను వినియోగిస్తున్నారు. రోజు రోజుకి ఈ స్మార్ట్ వాచ్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఒక స్మార్ట్ వాచ్ ని ప్రేక్షకులు వినియోగదారులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు స్మార్ట్ వాచ్ కంపెనీలు తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం కూడా మార్కెట్లో కొన్ని స్మార్ట్ వాచ్ లు ఎక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆ స్మార్ట్ వాచ్లు ఏవి అన్న విషయానికి వస్తే..

ఫైర్-బోల్ట్ కొత్తగా వోగ్ లార్జ్ స్మార్ట్ వాచ్‌.. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ వాచ్. దీనిలో 2.05 అంగుళాల, 428*518 పిక్సెల్ రిజల్యూషన్‌తో డిస్‌ప్లే ఉంటుంది. ఆల్ వేస్ ఆన్ డిస్ ప్లే ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ మెష్ స్ట్రాప్ తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 500 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, ఎన్ఎఫ్సీ యాక్సెస్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఐపీ68 రెసిస్టెన్స్‌తో వస్తుంది. నావిగేషన్ కోసం రౌండేబుల్ క్రౌన్, బహుళ స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. 260 ఎంఏహెచ్ బ్యాటరీ ఒకే చార్జ్‌పై 6 రోజులు పనిచేస్తుంది. ఈ వాచ్, మ్యూజిక్ ప్లేయర్ ని సమర్థంగా నిర్విర్తిస్తుంది. దీని ధర ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో రూ. 1999గా ఉంది.

బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్.. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న సరసమైన ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇదీ కూడా ఒకటి. అద్భుతమైన టీఎఫ్టీ కలర్ ఫుల్ టచ్ స్క్రీన్, 240*240 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది సొగసైన, స్టైలిష్ డిస్‌ప్లేను అందిస్తుంది. 320 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ మాగ్నెటిక్ క్లోజర్ పట్టీలతో మన్నికైన మెటల్ బాడీని కలిగి ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. దానితో పాటు 7 రోజుల వరకు అద్భుతమైన బ్యాటరీ జీవితకాలం ఉంటుంది. 120+ స్పోర్ట్స్ మోడ్‌లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్, మణికట్టుపై గేమింగ్‌ కు అవకాశం ఇస్తుంది. నోటిఫికేషన్‌లను వాచ్ లో చూడొచ్చు. సంగీతాన్ని నియంత్రించవచ్చు. దీని ధర అమెజాన్లో రూ. 1,999గా ఉంది.

ఫైర్ బోల్ట్ టాక్ 2 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్.. దీనిలో స్పష్టమైన 1.28 అంగుళాల 240*240 పిక్సెల్ రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ వాచ్ వస్తుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో టీఎఫ్టీ ఎల్సీడీ ఫుల్ టచ్ డిస్ప్లే వస్తుంది. ఈ వాచ్ 2డీ హై హార్డ్‌నెస్ గ్లాస్ నుంచి సూపర్ ప్రొటెక్షన్‌తో విజువల్ ట్రీట్‌ను అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌తో ఫీచర్ ఉంటుంది. ఒకే ఛార్జ్‌తో బ్లూటూత్ కాలింగ్ కాలింగ్ అయితే మూడు రోజుల వరకు బ్లూటూత్ లేకుండా అయితే ఎనిమిది రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. డ్యూయల్-బటన్ సాంకేతికత సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే అంతర్నిర్మిత మైక్, స్పీకర్ హెచ్డీ కాలింగ్, సంగీత ఆనందాన్ని అనుమతిస్తుంది. 60 స్పోర్ట్స్ మోడ్‌లు, హెల్త్ ట్రాకింగ్, వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 1,299గా ఉంది.

ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్.. దీనిలో 1.39 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఫుల్ టచ్ స్క్రీన్ 240*240 పిక్సెల్ హై రిజల్యూషన్ వస్తుంది. అబ్బురపరిచే 280 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. గరిష్టంగా ఏడు రోజుల బ్యాటరీ జీవితం. బ్లూటూత్ కాలింగ్‌తో నాలుగు రోజులు అందిస్తుంది. మెటల్ బాడీ మన్నికను అందించడమే కాకుండా గ్లోస్ ఫినిషింగ్‌ను అందిస్తుంది. 120+ స్పోర్ట్స్ మోడ్‌లు, హెల్త్ ట్రాకింగ్, ప్రత్యేకమైన బ్రీత్ ఫంక్షన్‌తో మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ట్రాక్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్‌లతో కనెక్ట్ అయి ఉండొచ్చు. సంగీతాన్ని నియంత్రించొచ్చు. ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఒకే ట్యాప్‌తో పనులను సులభతరం చేస్తుంది. ఈ వాచ్ ధర అమెజాన్ సైట్లో రూ. 1199గా ఉంది.

ఫైర్-బోల్ట్ ఆస్టరాయిడ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే స్మార్ట్ వాచ్.. ఇది 466*466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. పగటి పూట సూర్యకాంతిలో కూడా అద్భుతమైన దృశ్యమానతను అందిస్తుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేను ఇది కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఉంటుంది. హృదయ స్పందన రేటు, నిద్ర ట్రాకింగ్‌తో సహా కచ్చితమైన ఆరోగ్య పర్యవేక్షణ మీ శ్రేయస్సును నిర్ధారిస్తుంది. 123 స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, నోటిఫికేషన్లు, వాయిస్ సహాయంతో నియంత్రణ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర అమెజాన్లో రూ. 1499గా ఉంది.