Android Users Under Attack: స్మార్ట్ ఫోన్ యూజర్లను గడగడలాడిస్తున్న DoS attack…కేంద్ర ఐటీ శాఖ అలర్ట్ జారీ.!!

DoS attack on Smartphone: Android 10, Android 11, Android 12, Android 12L ఓఎస్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా. అయితే మీకు ఇదొక హెచ్చరిక అనే చెప్పాలి.

Published By: HashtagU Telugu Desk
Mobile Phones

Mobile Phones

DoS attack on Smartphone: Android 10, Android 11, Android 12, Android 12L ఓఎస్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా. అయితే మీకు ఇదొక హెచ్చరిక అనే చెప్పాలి. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు కొత్త హెచ్చరిక జారీ చేసింది. Android 10, Android 11, Android 12, Android 12Lని ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేక లోపాలను గుర్తించినట్లు తెలిపింది. స్మార్ట్ ఫోన్ లో ఒక వ్యక్తి పర్సనల్ సమాచారాన్ని బహిర్గతం అయ్యేలా కొన్ని మాల్ వేర్స్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని గుర్తించింది.

“Android OS ఫ్రేమ్‌వర్క్ భాగాలు, మీడియా ఫ్రేమ్‌వర్క్ కాంపోనెంట్‌లు, సిస్టమ్ కాంపోనెంట్‌లు, కెర్నల్ LTS, MediaTek కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ కాంపోనెంట్‌, క్వాల్‌కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్‌లలో లోపాల కారణంగా ఈ లోపాలు తలెత్తాయని” అని అడ్వైజరీ పేర్కొంది. సలహా ప్రకారం, ఈ లోపాలను వినియోగించుకొని, సైబర్ దాడి చేసే వ్యక్తి మరింత స్వేచ్ఛను పొందేందుకు, సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ప్రయత్నించవచ్చని తెలిపింది. దీన్నే DoS attack అంటున్నారు.

మీ స్మార్ట్ ఫోన్ సురక్షితంగా ఉండటానికి, మీ స్మార్ట్‌ఫోన్ కోసం అందుబాటులో ఉన్న Android OS యొక్క తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని CERT-in సిఫార్సు చేస్తోంది. మీరు సెట్టింగ్‌ల యాప్‌కి వెళ్లడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ కోసం అందుబాటులో ఉన్న తాజా వెర్షన్ కోసం తనిఖీ చేయవచ్చు.

DoS అటాక్ అంటే ఏమిటి?
DoS అటాక్ అనేది పరికరం లేదా నెట్‌వర్క్ సోర్స్ లను యాక్సెస్ చేయడానికి హ్యాకర్ ప్రయత్నించినప్పుడు సంభవించే సైబర్ భద్రతా ముప్పు. దీని అర్థం మీ స్మార్ట్‌ఫోన్ DoS ఎటాక్ కు గురైతే ఉన్నప్పుడు, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించలేరు. చాలా సందర్భాలలో, ఈ రకమైన సైబర్ అటాక్స్ ద్వారా మీ బ్యాంకు ఖాతాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. లేదా సమాచారాన్ని లీక్ చేయడం, వంటివి జరిగే వీలుంది.

  Last Updated: 02 May 2022, 09:47 AM IST