Site icon HashtagU Telugu

Mobiles : ఎన్నో మోడల్స్ వచ్చిన ఆ మోడల్ రికార్డును టచ్ చేయడంలేదు..!

Nokia 1100

Nokia 1100

ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో రోజుకో కొత్త మోడల్ విడుదలవుతోంది. ప్రస్తుత ట్రెండ్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా ఐఫోన్‌లకు గ్లోబల్‌గా భారీ డిమాండ్ ఉంది. కానీ, ఇప్పటికీ “అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఫోన్” రికార్డును నోకియా 1100 (Nokia 1100) కే ఉంది. కొత్తగా మార్కెట్ లోకి ఎంత టెక్నాలజీ తో కొత్త ఫోన్లు వచ్చినా, ఈ లెజెండరీ ఫోన్ రికార్డును ఏ కంపెనీ బ్రేక్ చేయలేకపోతోంది.

నోకియా 1100 ఫోన్ ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ యూనిట్లు అమ్ముడైంది. 2003లో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ దశాబ్దం పాటు యూజర్ల చేతుల్లో మారుమ్రోగింది. దీని తర్వాత నోకియా 1110 ఫోన్ 248 మిలియన్ యూనిట్లు అమ్ముడై రెండో స్థానంలో నిలిచింది. ఇక స్మార్ట్‌ఫోన్లలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్ ఐఫోన్ 6/6 ప్లస్. ఇది 222 మిలియన్ యూనిట్లు అమ్ముడైనప్పటికీ, నోకియా రికార్డును మాత్రం చేరుకోలేకపోయింది.

Zomato : జొమాటో కొత్త యాప్ లాంచ్..ఇక అన్ని ఇక్కడే ..!!

నోకియా 1100 విజయానికి ప్రధాన కారణం దాని సింప్లిసిటీ, బ్యాటరీ లైఫ్, స్టడీ డిజైన్. ఒకసారి చార్జ్ పెడితే రోజంతా వాడుకోవచ్చు. ఈ ఫోన్‌లో టార్చ్ లైట్, స్నేక్ గేమ్ వంటి చిన్న ఫీచర్లు ఉన్నా, అవి అందరికీ ఆకర్షణీయంగా మారాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగమిచ్చే ఫోన్ కావడం దీని రికార్డు స్థాయిలో అమ్మకాలకు దారి తీశాయి. స్మార్ట్‌ఫోన్లు ఎంతగా పెరిగినా, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇప్పటికీ ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నోకియా ఫోన్‌ల డిమాండ్ ఉంది. ఐఫోన్లు, సామ్‌సంగ్, షావోమీ, వివో లాంటి బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్ విభాగంలో రాణిస్తున్నా, నోకియా 1100 స్థాయిలో సేల్స్ చేయడం మాత్రం చాలా కష్టంగా మారింది. మొత్తంగా చెప్పాలంటే.. కొత్త టెక్నాలజీ ఎంత ఎదిగినా, నోకియా 1100 లాంటి లెజెండరీ ఫోన్‌ను అధిగమించడం ఏ బ్రాండ్‌కైనా సవాలుగా మారింది.