Site icon HashtagU Telugu

Honor X8B : బడ్జెట్ ధరలో అదిరిపోయే కెమెరాతో ఆకట్టుకుంటున్న సరికొత్త హానర్ స్మార్ట్ ఫోన్..

The New Honor Smartphone Is Impressive With A Budget Friendly Camera.

The New Honor Smartphone Is Impressive With A Budget Friendly Camera.

Honor X8B Smart Phone : చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది హానర్ (Honor) సంస్థ. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. హానర్‌ ఎక్స్‌8బీ (Honor X8B) పేరుతో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హానర్‌ ఎక్స్‌ 8బీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను మొదట సౌదీ అరేబియాలో లాంచ్‌ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తర్వలోనే భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. హానర్ ఎక్స్‌8బీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. మేజిక్‌ క్యాప్సూల్స్‌ నోటిఫికేషన్‌ ఫీచర్‌ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌ తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగాపిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. సైడ్‌ ఫేసింగ్ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఫీచర్‌ను ఇచ్చారు.

ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. డ్యూయెల్​ సిమ్​, 4జీ వోల్ట్​ఈ, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్​ 5.0జీ, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​ సీ పోర్ట్​వంటి ఫీచర్స్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​, 512జీబీ స్టోరేజ్​ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర భారత్‌లో రూ. 20 వేలుగా ఉంటుందని అంచనా. అలాగే ఈ హానర్‌ ఎక్స్‌8బీ స్మార్ట్‌ ఫోన్‌ మనకు మిడ్​నైట్​ బ్లాక్​, టిటానియం సిల్వర్​, గ్లామరస్​ గ్రీన్​ వంటి 3 కలర్స్​లో అందుబాటులోకి రానుంది. భారత్‌లో ఈ ఫోన్‌ ఎప్పుడు లాంచ్‌ అవుతుందన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read:  Scooter Condition Tips: చలికాలంలో మీ స్కూటర్ రిపేర్ కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే?