Site icon HashtagU Telugu

Hp Evny Move : కదిలే ఆలిన్ వన్ వైర్లెస్ కంప్యూటర్ వచ్చేసింది!

Hp Evny Move

Hp Evny Move

Hp Evny Move : ప్రపంచంలోనే మొట్టమొదటి కదిలే  ఆలిన్ వన్ వైర్లెస్ పర్సనల్ కంప్యూటర్  ‘‘హెచ్పీ ఎన్వీ మూవ్’’ (Hp Evny Move)  వచ్చేసింది..  దీన్ని తీసుకెళ్లడానికి ఎలాంటి బ్యాగు కూడా అక్కర్లేదు.  ఈ పీసీలోనే కీ బోర్డును కూడా పెట్టేసి .. దానికి ఉన్న హ్యాండిల్ ను పట్టుకొని ఎక్కడికైనా ఈజీగా బయలుదేరొచ్చు. ఇందులో ఇంటెగ్రేటెడ్ టచ్ ప్యాడ్, ఫుల్ సైజ్ కీబోర్డు ఉన్నాయి. ల్యాప్ టాప్ సైజుకు సరిపోయే బ్యాక్ ప్యాక్ డివైజ్‌తో దీన్ని తయారు చేశారు. హెచ్పీ ఎన్వీ మూవ్ కు 24 ఇంచుల QHD డిస్‌ప్లే ఉంది. ఇందులో ప్రత్యేక సెన్సర్ ఉంది. దీని ద్వారా యూజర్లు దీని ఉనికిని సులభంగా గుర్తించవచ్చు.  సెన్సర్ ద్వారా ఐడెంటిఫై చేసేలా ఇందులో ఆడియో సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

సెన్సర్ ఫీచర్ వల్ల.. మీరు ‘‘హెచ్పీ ఎన్వీ మూవ్’’ కు దూరంగా ఉన్న టైంలో ఈజీగా ఆపరేట్ చేసే వెసులుబాటు కలుగుతుంది.  ‘‘హెచ్పీ ఎన్వీ మూవ్’’ లో అడాప్టివ్ సరౌండ్ సౌండ్ వ్యవస్థ ఉంది. అంటే.. ఇంట్లో మీరు ఎక్కడ ఉన్నారో గ్రహించి స్పేషియల్ ఆడియోను ఇది ఆన్ చేస్తుంది. దాంతో మీరున్న చోటు నుంచే తగినంతగా సౌండ్ ను వినొచ్చు. కంప్యూటర్ ముందే కూర్చోవాల్సిన అవసరం లేదు. సినిమాలు చూసే వారికి, గేమ్ లు ఆడేవారికి ఇది సౌకర్యాన్ని ఇస్తుంది.  తన మొట్టమొదటి HP ఇమాజిన్ ఈవెంట్లో HP సరికొత్త ఎన్వీ మూవ్‌ను రిలీజ్ చేసింది. ఇందులో రీయూజబుల్ బ్యాటరీ ఉంటుంది. హెచ్పీ ఎన్వీ మూవ్ ల్యాప్‌టాప్‌లోని AI టెక్నాలజీ మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలోనూ సహాయపడుతుంది. ల్యాప్‌టాప్ నుంచి ఎంత దూరంలో కూర్చోవాలి ? ఎంత టైం పాటు ఉపయోగించాలి ? అనే దాని గురించి యూజర్లకు స్క్రీన్ టైమ్ రిమైండర్లను పంపిస్తుంది. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎల్పీడీడీఆర్5 మెమొరీ, 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ తో ‘‘హెచ్పీ ఎన్వీ మూవ్’’ వస్తోంది. ఈ ల్యాప్ టాప్ ను ప్రస్తుతానికి ఈ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనే అవకాశం ఉంది. దీని ధర భారత కరెన్సీలో దాదాపు రూ.74,796. ఈ ల్యాప్ టాప్ వచ్చే ఏడాది మన దేశంలో (Hp Evny Move)  విడుదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version