Site icon HashtagU Telugu

Google Pixel 7a Discount: గూగుల్ పిక్సెల్ 7ఎ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఫీచర్స్ ఇవే?

Mixcollage 25 Dec 2023 06 44 Pm 3914

Mixcollage 25 Dec 2023 06 44 Pm 3914

కొత్త ఫోను కొనుగోలు చేయాలి అనుకుంటున్నావా కి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ స్టోర్లలో మాత్రమే కాకుండా ఆఫ్లైన్ స్టోర్లలో కూడా ఇయర్ ఎండ్, క్రిస్మస్ సేల్స్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే స్మార్ట్ ఫోన్లు కార్లు బైక్లు ఎలక్ట్రిక్ స్కూటర్ల పై భారీగా తగ్గింపు ధరతో అతి తక్కువ ధరకే అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ 7ఎ ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 7ఎ అనేది బడ్జెట్ ప్రీమియం సెగ్మెంట్‌ లోని కెమెరాల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

గతంలో కన్నా మెరుగైన డీల్‌ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో వింటర్ ఫెస్ట్ సేల్ సందర్భంగా ఈ స్మార్ట్‌ ఫోన్ ప్రారంభ ధర రూ. 39,999 ఉండగా రూ. 33,999కి అందుబాటులో ఉంది. వాస్తవానికి, ప్రాథమిక తగ్గింపు మాత్రమే. అయితే, మీరు డీల్‌ను మరింత మెరుగైన డీల్‌తో పొందవచ్చు. తద్వారా మీరు కొన్ని కూపన్‌లు, బ్యాంక్ ఆఫర్‌లను కలిపి ఉంచవచ్చు. ఉదాహరణకు, రూ. 5వేలు బేస్ డిస్కౌంట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ఎవరికైనా వర్తిస్తుంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 2వేలు డిస్కౌంట్ పొందే విధంగా బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు. మీరు ఈఎంఐ చెల్లింపులను ఎంచుకుంటే మరో రూ. 500 తగ్గింపు పొందవచ్చు. పిక్సెల్ 7ఎ స్మార్ట్‌ఫోన్ పర్పార్మెన్స్, జీరో బ్లోట్‌వేర్, ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

బ్యాటరీ ఆప్టిమైజేషన్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది. దీనికి ఐపీ67 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కూడా ఉంది. గూగుల్ పిక్సెల్ 7ఎ ఫోన్ 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. గూగుల్ యాజమాన్య టెన్సర్ జీ2 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. 2022లో పిక్సెల్ 7 సిరీస్‌కు కూడా పవర్ అందిస్తుంది. కెమెరా పరంగా పిక్సెల్ 7ఎ ఫోన్ 64ఎంపీ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. దానితో పాటు 13ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలకు 13 ఎంపీ కెమెరా కూడా ఉంది. పిక్సెల్ 7ఎకి ఇంధనంగా 4,410ఎంఎహెచ్ బ్యాటరీ కూడా కలిగి ఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందిస్తుంది. పిక్సెల్ 7ఎ ఆండ్రాయిడ్ 13ఓఎస్‌తో వస్తుంది. కానీ, ఇప్పుడు ఆండ్రాయిడ్ 14కి అప్‌గ్రేడ్ అవుతుంది. గూగుల్ 3 ఏళ్ల ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.