Site icon HashtagU Telugu

Google Pay App : జూన్ 4 నుంచి ‘గూగుల్ పే’ షట్‌డౌన్.. ఎక్కడ ?

Google Pay App

Google Pay App

Google Pay App : గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ పేమెంట్ యాప్స్ వినియోగం ఇప్పుడు ఎంతగా పెరిగిందో మనకు తెలుసు. చిన్న చిన్న వస్తువుల కొనుగోళ్లు మొదలుకొని షాపింగ్, ఇన్సూరెన్స్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్ వంటి అన్ని రకాల  అవసరాలకు యూపీఐ పేమెంట్స్ కీలక మాధ్యమంగా మారాయి.  యూపీఐ సేవలకు డిమాండ్ అమాంతం పెరిగిన  ప్రస్తుత  పరిస్థితుల్లో గూగుల్ పే సేవలను బంద్ చేస్తామని ఆ సంస్థ అనౌన్స్ చేసింది. అయితే గూగుల్ పే షట్ డౌన్ జరగబోయేది మన ఇండియాలో కాదు. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ మార్కెట్ అమెరికాలో ఈ కీలక నిర్ణయాన్ని గూగుల్ అమలు చేయబోతోంది. అమెరికాలో ఈ ఏడాది జూన్ 4 నుంచి ‘గూగుల్ పే’ షట్‌డౌన్ అవుతుందని గూగుల్ వెల్లడించింది. ఇంతకీ అమెరికాలో గూగుల్ పేను(Google Pay App) ఎందుకు షట్‌డౌన్ చేయబోతున్నారు ? కారణాలేంటి ?

We’re now on WhatsApp. Click to Join

  • 2022 సంవత్సరంలో అమెరికాలో Google Wallet అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాతి నుంచి గూగుల్ పే యాప్ వాడే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది.  అప్పటిదాకా గూగుల్ పే  వాడిన వారంతా క్రమంగా గూగుల్ వ్యాలెట్ వైపునకు మారిపోయారు.
  • ఇకపై Google Wallet ద్వారానే చెల్లింపులు, ఇతర ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చేసుకోవచ్చని గూగుల్ వెల్లడించింది.
  • ఒక్క అమెరికాలోనే Google Pay యాప్‌ నిలిపివేస్తున్నామని.. భారతదేశం, సింగపూర్ వినియోగదారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గూగుల్ స్పష్టం చేసింది.
  • డిజిటల్ పేమెంట్స్ లో పాపులర్ అయిన గూగుల్ పే ఇప్పుడు వినియోగదారులపై కొత్త భారం మోపడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.