Humanoid Robot : ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ యుగం. ప్రతీ రంగంలోనూ ఏఐ హవా నడుస్తోంది. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం దాకా.. వైద్య రంగం నుంచి మొదలుకొని రక్షణ రంగం దాకా ప్రతీచోటా ఏఐ పాగా వేస్తోంది. ఇప్పుడు చిత్రలేఖన విభాగంలోకి కూడా ఏఐ జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చింది. ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోలు పెయింటింగ్స్ గీయడంలో సత్తా చాటుకుంటున్నాయి. మనుషులకు ఏ మాత్రం తగ్గకుండా తమ క్రియేటివిటీని చూపిస్తున్నాయి. తాజాగా ఒక హ్యూమనాయిడ్ రోబో గీసిన పెయింటింగ్‌ను కోట్ల రూపాయల ధరకు వేలం వేశారు.ఆ వివరాలను చూద్దాం..
Also Read : Highest Paid Singers : రెమ్యునరేషన్‌లో టాప్ – 5 సింగర్స్ వీరే.. ఆయనకు ఒక పాటకు రూ.3 కోట్లు
ఐ-డా(Ai-Da).. ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో ఆర్టిస్ట్(Humanoid Robot) ఇది. ఐ-డా గతంలో ఒక పెయింటింగ్‌ను గీసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ పితామహులలో ఒకరైన అలాన్ ట్యూరింగ్‌ను తలపించేలా చూడచక్కటి ముఖవర్ఛస్సుతో ఒక పెయింటింగ్‌ను ఐ-డా అప్పట్లో గీసింది. తనలో ఉన్న ఏఐ అల్గారిథమ్స్, రోబోటిక్ హ్యాండ్స్‌ను ఉపయోగించి ఈ రోబో పెయింటింగ్స్ గీసింది. వేలంపాటలు నిర్వహించే ప్రఖ్యాత కంపెనీ ‘సోథెబీస్’ ఈ పెయింటింగ్‌ను డిజిటల్ ఆర్ట్ సేల్‌లో ఇటీవలే విక్రయించింది. దీని కోసం 27కుపైగా బిడ్లు వచ్చాయి. అంటే అంతమంది దాని వేలంపాటలో పాల్గొన్నారు. చివరకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఈ పెయింటింగ్‌ను రూ.8 కోట్లకు కొనేశాడు. ‘ఏఐ గాడ్’గా పేరొందిన బ్రిటీష్ గణిత శాస్త్రజ్ఞుడు జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్ ముఖ కవళికలతో ‘ఐ-డా’ గీసిన మరో పెయింటింగ్ దాదాపు రూ. 9.15 కోట్లకు సేల్ అయింది.
- ఐ-డా అనేది ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో.
- 19వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు అడా లవ్‌లేస్ పేరిట ఈ రోబోకు ‘ఐ-డా’ అని నామకరణం చేశారు.
- ఈ రోబోను బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలకు చెందిన ఏఐ సైంటిస్టుల టీమ్ 2019లో తయారు చేసింది.
- ఈ రోబో చూసేందుకు అందమైన అమ్మాయిలా ఉంటుంది. దీని కళ్లలో కెమెరాలు ఉంటాయి. దీనికి బ్రౌన్ కలర్ హెయిర్ ఉంటుంది.