ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. దాంతో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగానే స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాయి. అలాగే ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు తక్కువ ధరకే ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కుదరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి తాజాగా టెక్నో సంస్థ ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. అదేమిటంటే..
టెక్నో పోవ 6 నియో ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 11న మార్కెట్లో విడుదల కానుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కొత్త ఫోన్‌లో ఏఐ సూట్ అందుబాటులో ఉంటుంది. AIGC పోర్ట్రెయిట్, ఏఐ కటౌట్, ఏఐ మ్యాజిక్ ఎరేజర్, ఏఐ ఆర్ట్‌బోర్డ్ వంటి అనేక ఏఐ ఫీచర్లు ఫోన్‌లో కనిపిస్తాయి. ఇవి ఫోన్‌ను చాలా ఆధునిక స్మార్ట్‌ఫోన్‌గా మారుస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Helio జీ99 ప్రాసెసర్ ఉంటుంది. గ్లోబల్ మార్కెట్‌లో 8జీబీ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ + 256జీబీ స్టోరేజ్‌తో సహా ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో లభించనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.
ఇకపోతే ఈ ఫోన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే.. కంపెనీ గ్లోబల్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న వేరియంట్ లలో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను అందించింది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కానీ ఇండియన్ వేరియంట్‌లో 108ఎంపీ ఏఐ కెమెరా ఇవ్వవచ్చు. పవర్ కోసం, ఈ ఫోన్ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్‌ను రూ.15 వేల కంటే తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేయవచ్చని అంచనా. ఈ ఫోన్ నైజీరియాలో 13,500 రూపాయలకు విడుదల చేసింది కంపెనీ. భారతదేశంలో ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా ద్వారా విక్రయానికి ఉండనుంది.