Site icon HashtagU Telugu

Tecno Pova 4: కేవలం రూ.12 వేలకే 8 జీబీ 128 జీబీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?

Tecno Pova 4

Tecno Pova 4

రోజురోజుకి దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో మొబైల్ తయారీ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఏడాదికి పదుల సంఖ్యలో మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. చాలామంది ఏడాదికి రెండు మూడు ఫోన్లు మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు వాటి ఫీచర్లు తెలియక కొనుగోలు చేసి ఆ తర్వాత అవి నచ్చలేదని పక్కన పెట్టేసి సరికొత్త స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తూ ఉంటారు.

అటువంటి వారి కోసం మార్కెట్లోకి ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఆ స్మార్ట్ ఫోన్ వివరాల విషయానికొస్తే..టెక్నో అనే చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ టెక్నో పోవా 4 పేరుతో సరి కొత్త స్మార్ట్ ఫోన్‌ ని లాంఛ్‌ చేయనుంది. కాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ డిసెంబర్‌ 13 నుంచి ప్రముఖ ఇ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ టెక్నోపోవా ఫోన్‌ లాంఛింగ్‌ ఆఫర్‌ కింద చాలా తక్కువ ధరకు తీసుకొస్తున్నారు. 8 జీబీ ర్యామ్128 జీబీ స్టోరేజ్‌ కలిగిన ఫోన్ ని కేవలం రూ.11,999కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఈ ఫోన్ బ్లూ, గ్రే, ఆరెంజ్‌ ఇలా వేరియంట్ లలో లభించనుంది. అలాగే 13 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన స్మార్ట్ ఫోన్ దానిని కేవలం రూ.15లలోపే అందుబాటులోకి రానుంది. 13 జీబీ ర్యామ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ని అంత తక్కువ ధరకే ఎలా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ టెక్నో నోవా 4 క్విజ్‌ ఫీచర్ ల విషయానికి వస్తే.. 6.82 ఇంచెస్‌ హెచ్‌డీ, ఐపీఎస్‌ ఎల్సీడీ స్క్రీన్ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌ డ్యూయల్‌ గేమ్ ఇంజిన్. అలాగే 8జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ 50 ఎంపీతో రెండు కెమెరాలు, 8ఎంపీ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 18 వాట్‌ స్పీడ్‌ ఛార్జింగ్‌ సిస్టమ్‌ తో మొబైల్ మార్కెట్ లోకి విడుదల కానుంది.