Tecno Phantom X2 Pro 5G: టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ప్రో 5జీ ఫోన్ సేల్స్ ప్రారంభం.. ధర, ఫీచర్స్ ఇవే?

రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో మార్కెట్ లోకి కొత్త కొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు

  • Written By:
  • Publish Date - January 25, 2023 / 07:00 AM IST

రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో మార్కెట్ లోకి కొత్త కొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు విడుదల అవుతున్నాయి. మరి ముఖ్యంగా మొబైల్ తయారు సంస్థలు ఒకదానిని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో కొత్త హంగులతో కూడిన మొబైల్ ఫోన్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే తొలిసారిగా రిట్రాక్టబుల్ పోర్ట్‌రైట్ లెన్స్‌తో ఓ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా ముడుచుకుపోతుందన్న మాట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఫోటోలు క్లిక్ చేయాలనుకున్నప్పుడు లెన్స్ బయటకు వస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేశారు.

మామూలుగా ఇటువంటి ఫీచర్ ని మనం ఫోటోగ్రఫీ కెమెరాలలో చూస్తూ ఉంటాం. అలా ఫోటోగ్రఫీ కెమెరా టెక్నాలజీని ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కి అందించనున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ పేరు హాంకాంగ్‌కు చెందిన టెక్నో మొబైల్ సంస్థ టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ప్రో 5జీ మోడల్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌ లో మాత్రమే రిలీజ్ అయ్యింది. 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే ఈ మొబైల్ లభిస్తోంది. ఈ మొబైల్ ధర రూ.49,999 గా ఉంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ మొదలయ్యాయి. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు మార్స్ ఆరెంజ్, స్టార్‌డస్ట్ గ్రే వంటి కలర్స్‌లో లభిస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే..

ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల ఫ్లెక్సిబుల్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. మిలిటరీ గ్రేడ్ యాంటీ గ్లేర్ గ్లాస్‌తో తయారవడం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. అదనంగా 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50మెగాపిక్సెల్,50మెగాపిక్సెల్,13మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో లభిస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారి 50మెగాపిక్సెల్ రిట్రాక్టబుల్ పోర్ట్‌రైట్ లెన్స్‌ ఇందులో ఉంది. అలాగే సెల్ఫీ,వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్పీ కెమెరాలో AI పోర్ట్రెయిట్, సూపర్ నైట్, ఫిల్టర్స్, కస్టమ్ మేకప్, వైడ్ సెల్ఫీ, HDR, బర్స్ట్ షాట్, AI సీన్ డిటెక్షన్, వీడియో అల్ట్రా స్టడీ, వీడియో ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5160mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగిఉండనుంది.