Site icon HashtagU Telugu

Tecno Spark 20C: మార్కెట్ లోకి కొత్త టెక్నో స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్?

Mixcollage 29 Feb 2024 08 32 Am 5517

Mixcollage 29 Feb 2024 08 32 Am 5517

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో మార్కెట్ లోకి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఫోన్ లతో పాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టెక్నో స్పార్క్‌ 20సీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్‌ 20సీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ మార్చి 5వ తేదీన సేల్‌ ప్రారంభం కానుంది.

టెక్నో స్పార్క్‌ 20సీ ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,999కాగా లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 7,999కే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో గేమింగ్ కోసం ప్రత్యేక టెక్నాలజీని అందించారు. ఈ ఫోన్‌ను కేవలం 50 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ36ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 720 x 1,612 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

ఈ ఫోన్‌లో MediaTek Helio G36 SoC ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇకపోతేకెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంది.

Exit mobile version