Tecno: అద్భుతమైన ఫీచర్స్ తో అదర గొడుతున్న టెక్నో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర పూర్తి వివరాలివే?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ టెక్నో ఇటీవల కాలంలో మార్కెట్లోకి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి స్మార్ట్ ఫోన్ లో విడుదల చేస్తున్న విషయ

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 04:00 PM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ టెక్నో ఇటీవల కాలంలో మార్కెట్లోకి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి స్మార్ట్ ఫోన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన టెక్నో సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కూడా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తో వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది టెక్నో సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా ఈ ఫోన్‌కు కొనసాగింపుగా టెక్నో స్పార్క్‌ 20 ప్రో ప్లస్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. వచ్చే జనవరిలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కంపెనీ తెలిపింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. టెక్నో స్పార్క్‌ 20 ప్రోకి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో కొన్ని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్ లను అందిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి కెమెరా క్వాలిటీతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. కాగా టెక్నో స్పార్క్‌ 20 ప్రో+ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియా టెక్‌ హీలియో జీ99 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే విడుదల చేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. వర్టికల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ యూనిట్‌ను అందించారు. ఇక ఈ ఫన్‌లో డబుల్‌ కర్వ్‌డ్‌ డిజైన్‌ను ప్రత్యేకంగా అందించారు. దీంతో యూజర్లు ఫోన్‌ను చాలా సౌకర్యవంతంగా పట్టుకునేందుకు వీలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. బెజ్‌లెస్‌ డిజైన్‌తో రూపొందించిన డిస్‌ప్లే ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. అలాగే సెంటర్డ్‌ పంచ్‌ హోల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నారు. అలాగే మెమోరీ కార్డుతో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఇకపోతే టెక్నో స్పార్క్‌ 20 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 44 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే.. అలాగే ఇందులో హాట్‌స్పాట్‌, బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌బీ సీ పోర్ట్‌, హెడ్‌ ఫోన్‌ జాక్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 12,000 నుంచి రూ. 15,000 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.