Site icon HashtagU Telugu

Tecno Spark 20: అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న టెక్నో సరికొత్త స్మార్ట్ ఫోన్?

Mixcollage 30 Jan 2024 02 52 Pm 1294

Mixcollage 30 Jan 2024 02 52 Pm 1294

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో మార్కెట్ లోకి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అతి తక్కువ దొరికే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఫోన్ లతో పాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా భారత్ లోకి మరొక సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతోంది టెక్నో. టెక్నో స్పార్క్‌ 20 పేరుతో భారత్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది.

త్వరలోనే మార్కెట్లోకి ఈ ఫోన్‌ రానుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి అందుబాటు లోకి రానుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను సైబర్ వైట్, గ్రావిటీ బ్లాక్, మ్యాజిక్ స్కిన్ బ్లూ, నియాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకురానున్నారు. ఇకపోతే ధర విషయానికొస్తే.. త్వరలో విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ రూ. 10,499గా ఉండనున్నట్లు తెలుస్తోంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచెస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్క్రీన్‌ రిఫ్రెష్ రేట్ 90Hzగా ఉంటుంది. ఇక ఈ ఫోన్‌ మీడియా టెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో వెనుక, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు రెండూ LED ఫ్లాష్‌ను కలిగి ఉంటాయి. బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో లాంచ్‌ చేయనున్నారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

Exit mobile version